పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాఠ్యపుస్తకాలు చదవకుండా, సందేహించకుందా, ప్రశ్నించకుండా,టీచర్‌ చెప్పిన జవాబులు కంఠస్తం చేయడాన్ని చదవడం అందామా? మొత్తం వ్వర్థం అయిపోయినట్లే కాదా!

భూమి గుండ్రంగా ఉందనీ, అది తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నదనీ పాఠంలో ఉంది. విద్యార్ధి చదువుతాడు. కానీ భూమి చదునుగా బల్లపరుపుగా ఉన్నట్లూ, స్థిరంగా కదలకుండా ఒకే చోట ఉన్నట్లు కళ్లకు కనబడుతుంది. సూర్యుడు తూర్పున ఉదయించి, అలా పైకి ఎగబాకి పడమట దిగిపోయి సూర్యుడే భూమిచుట్టూ తిరుగుతున్నట్లు గమనిస్తాడు. తాను చూస్తున్న దానికి విరుద్దంగా పాఠంలో ఉంది. ఇప్పుడేమి జరగాలి? సందేహించాలి. ఇది నిజమా అని ప్రశ్నించాలి. టీచర్‌తో స్నేహితుల్లో చర్చించాలి. తర్కించాలి. వాదోపవాదాలు జరగాలి. అనేక రుజువులు చూడాలి. అర్జం చేనుకోవాలి. ఓహా ఇదా నంగతి అని ఆశ్చర్యపోవాలి. ఆనందించాలి. లోపల ఏదో ఒక అనుభూతి పొందాలి. అంతకుముందున్న అభిప్రాయంలో మార్పు వస్తుంది. సత్యమేదో తెలుసుకొంటాం. జీవితంలో దాన్ని ఉపయోగించు కొంటాం. ఇదేమీ జరక్కుండా అర్ధం చేసుకోవడం జరిగే పనికాదు. మద్యలో మరో పితలాటకం వచ్చి కూర్చుంది. ఏ భాషలో అర్ధం చేసుకోవాలి? ఏ మీడియంలో చదవాలి? ఇది అకస్మాతుగా ఇప్పుడు పుట్టిన సందేహం. ఏ భాషలో మాట్లాడతారో, ఏ భాషలో ఆలోచిస్తారో ఏ భాషలో ప్రశ్నిస్తారో ఆ భాషలోనేగదా అర్థం చేసుకోవాలి. అది మాతృభాషే గదా! పరభాషను నేర్చుకోవాలన్నా మాతృభాష సహాయంతోనే కదా! ప్రపంచమంతా ఇదేగదా ఘోషిస్తున్నది.

మధ్యలో వచ్చిన ఈ పితలాటకాన్ని పక్కన బెట్టి అనలు విషయానికి వద్దాం. చదవడం అంటే అర్థం చేసుకోవడం అని తెలుసుకొన్నాం. మరి నేర్చుకోవడం అంటే ఏమిటి? పుస్తకంలో ఉన్న వాక్యాలను కంఠస్థం చేయడమా? కంఠస్థం చేయడాన్ని నేర్చుకోవడం అనకూడదు. బట్టీపట్టడం అనాలి.

నేర్చుకొనేవి విద్యలు, నైపుణ్యాలు. డ్రైవింగ్‌ నేర్చుకొంటారు. టైలరింగ్‌ నేర్చుకొంటారు. సంగీతం నేర్చుకొంటారు. నాట్యం నేర్చుకొంటారు. పరభాషలు నేర్చుకొంటారు. ఇందు కోసం కొంత శ్రమపడాలి. అభ్యాసం చేయాలి. ఒక సారి నేర్చుకొంటే జీవితాంతం మనవెంటే ఇవి ఉంటాయి. ప్రశ్నలకు జవాబు మరిచిపోయినట్లు మరిచిపోరు.

కుండలు చేయడం, బుట్టలు అల్లడం, వంట చేయడం, వ్వవసాయం, ఇలాంటివి ఎన్నో విద్యలున్నాయి. చదువుతో సంబంధం లేకుందా చాలా మందికి చాలా విద్యలు తెలుసు.

కాబట్టి అర్థం చేసుకోవడం వేరు. నేర్చుకోవడం వేరు. అర్ధం చేసుకోవడం అంటే విషయం ఇది అని తెలుసుకోవడం. ఈ తెలుసుకోవడం మానవుడి సహజ లక్షణం. ఇందు కోసం మనిషి తన ప్రాణమైనా ఇస్తాడు. తెలుసుకోవడం ఆసక్తికీ కుతూహలానికీ సంబంధించినది. అవనరం ఉండవచ్చు లేకపోవచ్చు. కానీ నేర్చుకోవాలంటే అవసరం ఉండి తీరాలి. అది భవిష్యత్తులో కలగబోయే ప్రయోజనం కోసం చేసేపని. ఇందు కోసం శ్రమపడాలి. మనస్సు, శరీరం రెండూ ఉపయోగించాలి.

తెలుసుకోవడం మానవుడి సహజ లక్షణం. నేర్చుకోవడం మానవుడు సాధించిన లక్షణం.

అర్ధం చేసుకోకుండా చదివేది చదువు కాదు. అదొక వ్యర్థ కార్యకలాపం. ఇలాంటి చదువులు ఉన్న దేశాలు, సమాజాలు ఎంతో నష్టపోతున్నాయి. సమాజాలు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. మన దేశం ముఖ్యంగా మన రాష్ట్రం ఎంతో నష్టపోతున్నది. ప్రతీదాన్ని డబ్బులతో కొలిచే ఈ ప్రపంచంలో ఇప్పుడు జరిగిన నష్టాన్ని డబ్బుతో లెక్కిస్తే కొన్ని లక్షల కోట్లు ఉంటుంది.

ఆ నష్టాలు ఇవే:

1. అద్భుతమైన బాల్యాన్నీ కాలాన్నీ డబ్బునూ నష్టపోతున్నారు. అర్ధం చేసుకోకుండా చదివినందు వల్ల క్రమంగా అర్థం చేసుకొనే శక్తిని కోల్పోతారు. అలోచించడం మానుకుంటారు. అస్తవ్యస్తంగా అలోచిస్తారు. దురభ్యాసాలకు లోనవుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. సులభంగా మోసపోతారు. ఇతరుల మీద ఆధారపడి బ్రతకడం అలవాటు చేసుకుంటారు.

2. కష్టపడి డిగ్రీలు సంపాదించుకుని ఉద్యోగస్తులైన వారు భవిష్యత్తులో ఒక్క పుస్తకం కూడా చదవరు. తమ వృత్తి నైపుణ్యాలను మెరుగు పరచుకోరు. ఎందుకంటే విజ్ఞాన సంబంధమైన పుస్తకాలు చదివి అర్ధం చేసుకోవడానికి భయపడతారు. అందువల్ల ఎలాంటి మార్పును స్వీకరించలేరు. సమాజాన్ని ముందుకు కదలనీయరు.

౩. ఉన్నత చదువులు చదివిన ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, అధికారులు, అలోచించలేని జనాలను తమ కింద ఉద్యోగులను చూసి తమ అధిక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. క్రింది వారిని పురుగుల్లా చూస్తారు. తమ తెలివి తేటలతో ప్రజల సమస్యలను పరిష్మరించవలసిన వీరు ప్రజలకే సమస్యగా మారతారు.

ఈ మనుష్యులు బాల్యంలో, కౌమారంలో, యవ్వన కాలాల్లో వత్తిడి లేకుండా, భయం లేకుండా, ఆనందంగా అర్దం చేసుకొంటూ చదివివుంటే ఈ ప్రపంచాన్నీ ఆనందంగా ఉంచేవారు. ప్రపంచం ఇంత దుర్మార్గంగా ఉండేది కాదు.

చదువు గొప్పదే, బడీ గొప్పదే-కానీ బోధనా పద్దతులు, పరీక్షలు, మార్కులు, పాస్‌, ఫెయిలు ఇవన్నీ అశాస్త్రీయం.

ఈ చదువులు పరాయి పాలకులు తమకు ఊడిగం చేసే బానిసలను తయారు చేయడానికి ఏర్పాటు చేసిన విద్యావిధానంలో భాగం. వాళ్లు పోయినా వాళ్ల విద్యావిధానం అలానే ఉంది. మన పాలకులకు కూడా స్వతంత్రంగా ఆలోచించలేని బానిసలేగదా కావలసింది. అందుకనే విద్యావ్యవస్థను మరింతగా దిగజారుస్తూ చట్టాలు తెస్తూ ఉంటారు. ఇప్పుడు మాతృభాషలోగూడా ఆలోచించ గూడదు. చదువు కోకూడదు అనే చట్టం తెచ్చారు. పరాయి పాలకులు కూడా చేయలేని సాహసం చేశారు. కారణం తెలుస్తూనే ఉంది కదా! మన చదువుల ద్వారా ఇంత కాలం తయారైంది అర్ధం చేసుకోలేని వాళ్లు. ఆలోచించ లేనివాళ్లు అలోచించగలిగినా నీజాయితిగా ధైర్యంగా సత్యాన్ని ఒప్పుకోలేనివాళ్లు.

ఇంతకంటే వేరే రుజువులు ఎందుకు?

“పిల్లలు అదనపు భాషను త్వరగా, సులభంగా, బాగా నేర్చుకోటానికి తల్లిభాష ఉపయోగపడుతుంది"

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

22