పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుంటుంది. అంటే నమాజంలో స్థానిక, వాణిజ్య శక్తులు బలపడడానికి స్థానిక భాషల ఆర్థిక స్థాయి పెరగాలి. స్థానిక భాషల ఆర్థిక స్థాయిలొ పెరుగుదల ఆ సమాజపు ఆర్జిక శక్తికి నిదర్శనం (ఉమామహేశ్వరరావు, 2017).

ఉత్పత్తిలో మాత్చభాష పాత్ర:

భాష, సమాజంలోని సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనం. జ్ఞానానికి మూలం సంస్కృతి అయితే, దానిని అందించే మాధ్యమం భాష. మనిషి చేస్తున్న ప్రతీ పనికీ వెనక ఆ పనికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ సమాచారం ఒక తరం నుండి మరొక తరానికి అందివ్వబడుతూ సమాజ ఆర్థికోన్నతికి సహకరిస్తుంది. కొన్నిసమయాల్లో జ్ఞాన సృష్టికి దారితీసి సమాజాన్ని ప్రగతి పథంలోకి నడిపిస్తుంది. జ్ఞాన సృష్టికీ, దాన్ని తదుపరి తరాలకు అందివ్వడానికి భాషే ఆధారం. ఈ ప్రక్రియను మాతృభాష సమర్థవంతంగా జరిపిస్తుంది. పనికి సంబంధించిన అవగాహనా పరిధిని మాతృభాష 'పెంచుతుంది.

వ్యక్తి సంపద సమృద్దిగా ఉంటేనే దేశసంపద సమ్మద్దిగా వుంటుంది. వ్యక్తి పనిచేయడానికి కావలసిన శక్తి సామర్ధ్యాలు, భాష నైపుణ్యం అన్నీమానవ మూలధనంగా పరిగణించబడతాయి. ఒక దేశ అభివృద్ది ఆ దేశ వ్యవసాయ, ఉత్పత్తి, సేవా రంగాలపై ఆధారపడి ఉంటుంది. వస్తూత్పత్తి విధానం ద్వారా మానవ జీవనం సరళీకృతం అయింది. ఉత్పత్తి జరగడానికి ముందు ఆలోచన, అది కార్యరూపం దాల్చడానికి కావలనీన ప్రణాళిక అన్నీ భాష ద్వారా సమకూరుతాయి. ఏ భాష అయితే ఈ క్రమానికి అడ్డంకిగా ఉండదో, ఆ భాష వాడుక వల్ల అధిక ఉత్పత్తిని రాబట్టవచ్చు. మాతృభాషే మనిషికి స్వాస్థ్యం. ప్రతి మనిషికీ ధనిక, పేద, జాతి, మత, కుల, లింగ వర్గాల భేదం లేకుండా సమాన వనరుగా ఉంటున్నది మాతృభాష మాత్రమే. ప్రతీ ఒక్కరి సృజనాత్మకతకూ, దానీ సాధనలో ఉండే కష్ట నష్టాలలో మార్గాన్ని మాతృభాష సుగమం చేస్తుంది.

ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తి సమాచారాన్ని 2003 నుండి 2010 వరకు ప్రపంచ బ్యాంకు భాషల ఆధారంగా విడుదల చేసింది. అంతర్జాలంలో భాషల వాడకాన్ని బట్టి సేకరించిన గణాంకాల ప్రకారం, స్థానిక భాషలు ఇంగ్లీష్‌ కంటే ప్రపంచ స్గూల జాతీయోత్పత్తికి ఎక్కువ మొత్తంలో దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది.

భారతదేశ స్థూల జాతీయోత్పత్తి సమాచారాన్ని ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఈ సమాచారం భారతదేశపు జనాభా గణనకు లేదా ఎథ్నోలాగ్‌ వంటి ఇతర వనరులకు అనుబంధంగా ఉంది. ఈ సమాచారం ప్రకారం భారతదేశపు స్థూల జాతీయోత్పత్తి భాషల ఆధారంగా క్రింది విధంగా విభజించబడింది: హిందీ 40.22%, బెంగాలీ 8.30%, తెలుగు 7.87%, మరాఠీ 7.45%, తమిళ భాష 6.32% ఉర్దూ 5.18%, గుజరాతీ 4.85%, కన్నడ 3.90%. ఇది కేవలం ప్రాంతాలవారిగా జనాభా మీద ఆధారం చేసుకొన్నదికానీ, శ్రామికుల పని స్థలాల్లో భాషావ్యవహారాన్ని శాస్రీయ పద్దతిలో అధ్యయనం చేసిన సమాచారం కాదు. పైన చెప్పిన విషయాలను శ్రామిక - ఉత్పత్తి సంబంధాలలో ఎలా

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

16