పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృషిపై ఆధారపడటం జరుగుతూవుంది. ఇంగ్లీషులో రాయడం అనేది నిజమైన సవాలుగానే మిగిలిందనీ ఈ రోజు మనం చిన్న సహోద్యోగుల అనుభవాన్ని బట్టి చూస్తే అవగతం అవుతుంది. అయినప్పటికీ, సైన్స్‌ లేదా గణితంలో తెలిసిన పాఠ్యపుస్తక విషయాలను నమ్మకంతో చదవడం బాగా పెరిగింది. నా సహచరులు మూడు, నాలుగు సంవత్సరాలలో వివరించినట్లుగా, వారు సాంస్కృతిక అవరోధాన్ని దాటినట్లు కనిపించారు. అక్కడ వారు ఇంగ్లీషులో ఉన్నత విద్య కోసం అకాంక్షించే కలను నేరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరాఠీలో తోటివారితో లేదా ఉపాధ్యాయులతో సాంకేతిక సంభాషణల వాతావరణం ఎంతో కొంత అదరణకు నోచుకుంది. వారు నేర్చుకున్న ఇంగ్లీష్‌ అనర్గళంగా లేదు కానీ ప్రపంచాన్ని ఎదుర్శొనే విశ్వాసానికి భిన్నంగా లేదు. మరీ ముఖ్యంగా వారు మరాఠీపై స్వారీ చేసే బలాన్ని పూర్తిగా ప్రాథమిక భాషగా మరాఠీనీ ఉపయోగించడంతో జరుగుతోంది. మరాఠీ పట్ల వారికి ఉన్న గౌరవం నిజమైనది, లోతైనది, ఇంకా కొనసాగుతోంది.

పిల్లలు భాషలను సులభంగా నేర్చుకోగలరనీ భాషాశాస్త్రవేత్తలు సూచిస్తున్నారనే సత్యాన్ని వారు చెప్పారు. ఇంటి భాష లేదా ప్రాంతీయ భాషలో ఉన్న అర్ధవంతమైన పటిమ మరొక భాషలో నైపుణ్యాలను సంపాదించడానికి సహాయపడుతుంది. ఈ విధంగా ఇంటిభాష లేదా ప్రాంతీయ భాష పట్ల గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రులు అలాంటి విధానానికి మద్దతు ఇచ్చారు, ఎందుకంటే అది కోరికలకు అటంకం కలిగించలేదు. ఉదాహరణగా నేను మాట్లాడిన ఒక సహోద్యోగి, ఇరవై సంవత్సరాల క్రితం ఆమె తన ప్రాథమిక విద్య సతారా జిల్లాలోని తన గ్రామ పాఠశాలలో చదువుకుంది. ఆమె మాధ్యమిక పాఠశాల (మిడిల్‌ స్కూలు) డొంబాన్లిలో సెమీ ఇంగ్లీష్‌ మోడల్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉంది. ఈ పాఠశాల మంచి పేరు సంపాదించి ఆమె మొహాలీలోని SERలో తన తదువరి చదువులను కొనసాగించ గలిగింది. చంద్రపూర్‌ జిల్లా నాగ్‌ఖిడ్‌ అనే చిన్న పట్టణానికి చెందిన మరో సహోద్యోగి తన పట్టణంలోని ఎయిడెడ్‌ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. తరువాత నాగపూరులో ఇంజనీరింగ్‌ చేశాడు. అలాగే, దేశంలోనీ ఒక ప్రధాన విజ్ఞాన సంస్థలో బోధిస్తున్న ఒక సహోద్యోగి ఇలా వ్రాశాడు, “నేను నా 11 -12 వ యేట థానే వద్ద అలాంటి పాఠశాలకు వెళ్లాను - ఇది 1890లలో ఏర్పాటు చేసిన ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చేత నిర్వహించబడుతున్న పాఠశాల. నా తల్లి, ఆమె తోబుట్టువులూ దాయాదులూ ఈ పాఠశాలకు వెళ్ళారు. 11 వ-12 వ యేట కూడా తరగతి గది సంస్కృతీ భాషా-మరాఠీనే. ఐతే, ఆంగ్ల పరిభాషను ఉపయోగించి మరాఠీలో గణితం మరియు విజ్ఞాన విషయాలను వివరించేవారు -బహుశా ఇది ఆ ఉన్నత పాఠశాల సెమీ-ఇంగ్లీషు కొనసాగింపు గాబోలు. చాలామంది విద్యార్థులు దిగువ మధ్యతరగతి ఆర్ధిక స్థితికి చెందినవారే. ఇది 1996-97లో, ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ లేదా కనీసం ఎలక్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ కోసం వెళ్లాలని కోరుకున్నారు.”

(తోటి ఉద్యోగులతో సమాచారం, ముఖాముఖీల అధారంగా)

మధ్యప్రదేశ్‌లో విరుద్ధమైన దృశ్యం

మధ్యప్రదేశ్‌లో ఒక జిల్లాకు చెందిన బస్తీ పరిస్థితి దీనికి విరుద్దంగా ఉంది. రెండు దశాబ్టాల క్రితం చాలా తక్కువ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలు ఉండేవి. అన్నీ ఫైవేట్‌ పాఠశాలలే. వారి తరగతి గదుల్లో ఉపయోగించాల్సిన భాషగా హిందీని నిషేధించారు.ఉపాధ్యాయులు హిందీలో సులభమైన పద్దతిలో వివరించలేరు. పిల్లలు హిందీలో మాట్లాడటానికి అనుమతి లేదు, ఎందుకంటే విద్యార్జులు ఇంగ్లీషును ఎంచుకోరనీ నీర్వాహకులూ, ఉపాధ్యాయులూ నమ్ముతారు. మీరు పిల్లలను ఇంగ్లీషులో మాట్లాడమని బలవంతం చేయాలని వారు వివరించారు. అన్నీ పాఠ్యపుస్తకాలూ ఇంగ్లీషులోనే, హిందీ మాత్రం ఒక సబ్జెక్టుగా ఉంటుంది. ఇలాంటి అనేక పాఠశాలల్లో ప్రాథమిక విద్య కూడా ఇంగ్లీషు మాధ్యమంలో ఉంటుంది. ఆట స్థలంలో, తరగతి వెలుపల, స్టాఫురూంలో ఉపాధ్యాయులూ పిల్లలూ ఇద్దరూ హిందీయే వాడుక. కానీ దీన్ని వారు చదువుతున్న పాఠ్యపుస్తకాలలోని వివరణలూ సంభాషణల కోసం తరగతి గది భాషగానూ ఉపయోగించడంలేదు. ఇది తరగతి గది బోధనా భాష కాదు. ఇంగ్లీషులో నైపుణ్యం తీవ్రంగా పరిమితం అయిన ఉపాధ్యాయులు సంక్షిప్త వివరణలను మాత్రమే చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులూ కొన్ని సార్హు హిందీని ఉపయోగించినందుకు ప్రిన్సీపాల్‌ తీవ్రంగా మందలించేవారు. తరగతి గదిలో హిందీనీ ఉపయోగించినప్పుడు కూడా అది తగనీది అనే భావనతో పరిమితం చేయబడింది.

నా తోటి ఉద్యోగి ఒకరు అటువంటి పాఠశాల ప్రిన్సీపాల్‌ గా 11 - 12 వ తరగతికి సంబంధించిన కొంతమంది సీనియర్‌ ఉపాధ్యాయులు అతన్ని సవాలు చేయటాన్ని గుర్తుకుతెచ్చుకున్నాను. వాళ్లుబోర్డు పరీక్షను సులువుగా దాటగలగాలంటే వారికి అర్ధమయ్యే రీతిలో హిందీలో వివరించటం తప్పనిసరి అని భావించేవారట. ఈ సహజ ధోరణి కొన్నేళ్లుగా అణచివేయబడుతోంది, ఎందుకంటే “ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడండి అనే ప్రమాణానికి విస్త్రత ఆమోదం ఉంది. దీంతో చిక్కులు తీవ్రం. ఉపాధ్యాయులూ విద్యార్హులూ ఇద్దరికీ అనుకూలమైన మార్గం పిల్లలు గుర్తుంచుకోవాలనుకొన్న పాఠంలోని సమాధానాలను 'బ్రాకెట్లలో పెట్టడం' ఆపైన బట్టీపట్టడం! ఈ పిల్లలు పట్టణంలోని ఉన్నత మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చారు. బడి పనులను అర్థం చేసుకోవడానికి తగినంత సమయం ఉంటుంది, ఇంట్లోనూ, ట్యూషన్‌లోనూ వారికి సహాయం అందుతుంది గదా, దాంతో ప్రపంచంలో ఎలాగో నెట్టుకొస్తారు. హిందీ పట్ల వారికున్న గౌరవం గణనీయంగా తగ్గిపోయింది. అటువంటి వాతావరణంలో, మధ్య ప్రదేశ్‌లో అభిమానించే భాషగా ఇంగ్లీష్‌ ఉన్నత పాఠశాలలకు చెందిన చాలా తక్కువ మంది విద్యార్థులకు మాత్రమే పరిమితం అయింది. కానీ, హిందీలో అర్థం చేసుకోవడం, అవగతం చేసుకోవడం మాత్రం వారికి సహజమైనా అది నిషేధానికి గురైంది. మరోవైపు, మహారాష్టలో పాఠశాలలో అభిమానించే అంశాలకు అర్దవంతమ్హైాన అవగావానను మిళితం చేయగల

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

11