పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/97

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

35


యన్నపానాంబరాద్యములఁ బోషించి,
సన్నుతిగన్న సజ్జనులు వీ రింద్ర!
పరికింపఁ బదికోట్లుబ్రహ్మకల్పంబు
లరిగెడునప్పు డీయచ్యుతుపురము
గసుగంద; దేమియుఁగా దొకింతయును;
విసువదు; నొగులదు; వేదనపడదు;
గరిమతో ననివృత్త కైవల్య మొసగు;
వరశుభాకుంఠ మీవైకుంఠపురము.
మహిమతో దద్దివ్యమందిరంబునకు
సహజసాహసులు, రక్షకులైన వారు,
దారుణవికటాష్టదంష్ట్రులు, నతుల
సారతేజులు, చతుష్షష్టిదంతులును,
ఘనతరమస్తకకఠినోగ్రవక్షు,
లనుపమచరణశోభాసహస్రాఢ్యు
లరయంగ లక్షకోట్లర్బుదపద్మ
వరశంఖసంఖ్య, లవార్యశోభితులు,
చండ[1]ప్రచండులు, చక్రి కింకరుల
ఖండితు లేపొద్దుఁ గాచియుండుదురు."
అని యని చెప్పుచు నాపద్మభవుఁడు
మునికొని వచ్చుచో, మొగి నొప్పుమీర
మాండవ్య కపిల రోమశ భరద్వాజ
శాండిల్య భృగు పరాశర కుంభజన్మ
నారద వ్యాస శౌనక గౌత మాత్రి
వారిభుగ్జటిల పర్వత పైల సుబల
శుక మతం గాంగీరసులు మొదలైన
సకలమునీంద్రు లుత్సవలీలఁ గొలువఁ,

  1. ప్రచండవిచక్ర (మూ)