పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/92

ఈ పుట ఆమోదించబడ్డది

30

ద్విపదభారతము


మనకెల్ల దిక్కు తామరసాసనుండు;
చని యమ్మహాత్ముని 'శరణ'న్న, నతఁడు
వలగొను నీదురవస్థలన్నియును
దలఁగించు; నటకుఁ బోదమం” డని కదలి,

అమరులు బ్రహ్మయొద్ద కేఁగుట

తడయక వారును దానును గూడి
కడువేగ బ్రహ్మలోకంబున కేఁగి,
ధర్మతపోయజ్ఞదానదక్షిణలు,
నిర్మలశ్రుతిశీలనీతిసత్యంబులు,
పరమాత్ములగు సురబ్రహ్మసంయములు,
వరుసతోడుతఁ జక్రవర్తులు, నృపులు,
మునుకొని హస్తాబ్జములు ముకుళించి
వినయంబు మెఱయ సేవింపుచు నుండ,
వీణా[1]లసచ్ఛుకాన్వితపాణియైన
వాణీసమేతుఁడై వరసౌఖ్యలీల
గమలభాసురకర్ణికావిస్తరమున
రమణమైఁ గొలువున్న బ్రహ్మకు నెఱఁగి,
యతులితభక్తి హస్తాబ్జముల్ మొగిచి
వితతాగమోక్తుల వినుతించుటయును,
సారసభవుఁడు వత్సలత దీపింప
వారల వదనవైవర్ణ్య మీక్షించి;
"గురు శక్ర శిఖి యమ కోణవ వరుణ
మరు దర్ధపతి శివుల్, మదిఁ జాల నలసి
వచ్చినయట్లున్నవారలె! యలఁత
యొచ్చోటినుండి మీ కిటు సంభవించె!

  1. ల సన్నుతాన్వితమైనపాణి. (మూ)