పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/86

ఈ పుట ఆమోదించబడ్డది

24

ద్విపద భారతము


గమికొన్న మేఘసంఘము చాయ మించు
 [1]హిమశైలమునుబోలి యిభనాథు డమరె.

దూర్వానుఁ డింద్రుని శపించుట

అప్పుడు దూర్వాసుఁ డయ్యమరేంద్రు
నిప్పులు చెదరంగ నిబిడరోషమునఁ
బృథులాజ్యధారల పెల్లున నెనయు
ప్రథి తానలముభంగి భగ్గునమ౦డి,
మోమున నెత్తు రిమ్మునఁ గ్రమ్ముదేర
మోమును సర్వాంగములుఁ జెమరింపఁ,
బ్రళయాగ్ని రుద్రుని ఫాలాక్షి వహ్ని
లలిఁబొల్చు బడబానలము నైక్య మొదవి
మునిరూపమున నిట్లు మొనసెనో యనఁగఁ
గినిసి, యయ్యింద్రు నీక్షించుచుఁ బలికె:
"నోరిమదాంధ, నీయున్నతైశ్వర్య
కారణంబున నీకుగౌరవంబొదవ
నేనుదీవించి నీ కిచ్చినయట్టి
మానిత పుష్పదామంబు గైకొనక,
కలిమిమై నిలఁ గల్పకంబులు పెక్కు,
గలవని మదిలోనికండగర్వమునఁ
గడునెల్లిదంబునఁ గరటికుంభమున
నిడితివి; యే నీకు నింతయల్బుఁడనె!
ధరణిఁ జేయఁగరానితప్పొనర్చినను,
గరుణఁ గాచినయట్టి [2]గౌతమఋషినె !
అనుదివసంబుఁ బంచాంగంబు చెప్పి
పనులొనర్చెడు బృహస్పతిగఁ జూచితివె !

  1. హేమశైలముంబోలి
  2. గౌతమీసతినె.(మూ)