పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/82

ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము



యప్పరోంగన భూమి యందు గ్రీడింప
లిప్సమీరంగ నాళీనినహమ్ము
దానును వచ్చుచోఁ, దరుణీలలామ
చేనున్న కల్పకక్షితిజ ప్రసూన
మంజరీ విమలదామమ్ము వీక్షించి
సంజాత కౌతుకోత్సాహుడై చేరి :
" శుభమస్తునీకు నోశుభ కాంత, మాకు .
నభిమతమయ్యె నీయలరుల దండ,
పొసఁగంగ బ్రాహ్మణ బుద్ధిగా మాకు
నొసగుము నీవన్న, యుగ్మలి యపుడు
పటుభక్తిమైఁ బాణిపద్మముల్ మొగిచి,
నిటలంబు పైఁజేర్చి, నెఱిసన్నుతించి
“యోమునినాథ, నీయుల్లంబులోన
నీమాడ్కిఁ బ్రియమైన నిదియెంతపెద్ద
కో”. మ్మనియొసగఁ, గైకొని మునీంద్రుండు
సమ్మదంబొదవ నచ్చరఁ బ్రస్తుతించి,
యావుష్పదామకం బఱుత నుల్లాసుఁ
డై పూని విహరించునాసమయమున,
నేమహాత్ముని [1]దొడ్డి నెల్ల కాలంబుఁ
గామధుగ్ధేనువుల్ కదుపులై యుండుఁ,
బారిజాతంబు లేప్రభువు క్రీడించు
నారామమున గుంపులై కనుపట్టుఁ
దలఁపుఱాలెపుడు నేధన్యుగేహమున
నెలకట్టడంబులై నెలకొని వెలయు,
నచ్చర లేవేల్పునాస్థానసీమ
నిచ్చలుఁ గాసించి నిలిచియుండెదరు,

  1. తోడి. (మూ )