పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/77

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

15


మేలుచేయనుబోయి మెయిమెయి నుంటి ;
మేలు నీశాంతంబు మేదినీనాథ !
శత్రుని సాధింపఁజాలని రాజు,
పుత్రసంతానంబుఁబొరయనిమనువు,
నురుకీర్తిలాభంబు నొరయని ధనము,
చిరశౌర్య, వృథయని చెప్పఁగా వినవె !
[1] సోముండు రాజని శ్రుతులు ఘోషించు ;
నా మేటి దిగ్విజయము, తొల్లి చేసి,
రాహువుఁ బగవాని [2]రక్షోవిశేష
దేహంబుతోఁ బాపె దివ్యయత్నమున.
ఆసోమకులవార్థి నధిప, జన్మించి
యీసుదలంప ; వీవెట్టిభూపతివి !
ఒంటికంబము మేడ లొగి మీఁదమీఁద
మింటితోఁ, [3] జేరంగ మేదినిఁగట్టి,
యా మేడలకుఁజుట్టు నగడత పన్ని,
యామయామవిబుధు, లౌషధకరులు,
శస్త్రవైద్యులు, మంత్రశాస్త్రసంపన్ను,
లస్త్రపాణులు నుండ నధిపునిఁదరిసి,
కపట భావంబునఁ గఱచి వధించి,
తపనుండుసాక్షిగాఁ దనపేరువాడి
పోయినపగవాడు బొందితోనుండ,
నీయున్కిచూడ నిన్నేమనఁగలదు !
ఎవ్వరు నిది నీకు నెఱిఁగింపకునికి
నివ్వెఱఁగయ్యెడు ! నీచిత్తమెట్లొ!
హితముచెప్పెదఁ; గాని, యేను నీతోడ
నతిసాహసపుమాటలాడుటయెఱుఁగ.

  1. సోముండు రాజనిశృతుని పోషింప,
  2. రక్షావిశేష.
  3. జేయంగ, (మూ)