పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/69

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

7


మెచ్చి యముం డంత మేదినీశులకు
నిచ్చిన వరము లేమేమి యేవురకుఁ ?
బోయి పార్థులు మత్స్యపురిసమీపమున
నాయుధంబులు దాఁప నను వెట్లు గనిరి ?
ఏవేషములుదాల్చి యేవురు విరట
భూవరుఁ గొలిచిరి పూఁబోఁడితోడ ?
నందు భీముఁడు కీచకావళినెల్ల
నిందుబింబాస్యకై యెట్లు మర్దించె  !
బలిమిఁ ద్రిగర్తులు పశులఁబట్టుటయు,
నలిగి విరాటుఁ డెట్లాజికిఁ బోయె!
తఱిమిపట్టినఁ గ్రీడి తా నెట్లు వెడలె ?
మఱునాఁడు గోవుల మఱియుఁ గౌరవులు
గోవుల మరలించి, కురురాజు దొరల
నేవిధంబున గెల్చె నింద్రనందనుఁడు !
ఆమత్స్యపతికూఁతు రభిమన్యు నెట్లు
తామరసాక్షి యుత్తర పెండ్లియాడె ?
నంత రణోద్యోగులై పాండుసుతులు
వింతగా నెచ్చోట విడిసిరి మెఱసి ?
కయ్యంబునకుఁదోడుగా నిందునందు
నెయ్యులై కలిసిన నృపతులెవ్వారు ?
ఒక్కట హరిఁబిల్వ, నురగకేతనుఁడు
నక్కిరీటియుఁ బోవ, హరి యేమిచేసెఁ  !
బొరిఁ [1] : బాండులకుఁ దోడుపోయెడుశల్యుఁ
గురుపతి తా నెట్లుకొలిపించుకొనియె!
దూతయైపోయి, పార్థులఁజూచి, మరలి
యేతెంచి సంజయుం డేమని చెప్పె ?
నప్పుడు నీతిగా నాంబికేయునకుఁ
జెప్పిన విదురునిసిద్ధాంత మెట్లు ?

  1. " పాండవేయు ” లను నర్థములో వాడియుండును.