పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/684

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

618

ద్విపద భారతము.


దైవమానుషములఁ దర్కింప నధికు
లీవసుంధరలోన నెన్నిభంగులను ;
చంద్రసూర్యులు గాడ్చు శమనుండు వహ్ని
యింద్రాదిదివిజులు నీశుండు హరియు
.......... ........... .......... .......... ..........
మిమ్మునెవ్వరును బేర్మిని గెల్వలేరు
ఇమ్మహిఁ గలరాజులెల్లఁ ; గ్రమ్మఱను
వైళమేతెంచి భూవలయమేలుండు
వాలాయముగ." నన్న వరుస ధర్మజుఁడు
విదురుని సద్భక్తివినుతించి పలికె:
"విదితకీర్తివి శాస్త్రవిదుఁడవు నీవు;
నీకృపగలుగంగ నేము లక్ష్ములను
బ్రాకటవిజయసంపదల నుండుదుము.
నీకడనుండును నెఱయంగఁ గుంతి
[1]శ్రీకర, యేమువచ్చెడియంతఁదాఁక."
అని విదురునియింట నటు కుంతినునిచి
యనఘులు కురువృద్ధులాజ్ఞగైకొనుచుఁ
బోవంగఁదలఁచి యప్పుడు భక్తిఁ గుంతి-
దేవిపాదములకు దృఢభక్తిమ్రొక్క,
నా [2]గొంతిదేవియు నాత్మనందనుల
వేగంబెగనుఁగొని వేదనఁబొంది
పలికెను: “వల్కలాంబరములు గట్టి,
నలువొప్పఁ గృష్ణాజినములు ధరించి,
మునివేషధారులై మునుకొని మీరు
చనియెదరా ! వనస్థలమున," కనుచుఁ
గన్నుల బాష్పాంబుకణములు దొరఁగ
విన్నఁదనంబున వెచ్చనూర్చుచును

  1. శ్రీకేళి.
  2. కుంతి. (మూ)