పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/673

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

607


దెఁఱగొప్ప ఛప్పన్న దేశాధిపతులు
వరుసతో గములుగావచ్చియున్నపుడు,
పెనఁగొని విల్లెక్కు పెట్టి బాణంబు
గొనకొనితొడుగంగ గుఱియేయఁబూన
నసమర్థులై తేజమణఁగి యందఱును
వెస మర్లిచూడంగ, వృత్రారిసుతుఁడు
నలవోక నావిల్లు నవలీలనెత్తి
యెలమితోడుత గుణమెక్కించి మించి
యలఘుఁడై బాణంబులైదు సంధించి
తలకొని మత్స్యయంత్రంబుపడవేసి
నన్నుగైకొనిపోవ, నరనాథులెల్లఁ
బన్ను గాఁ బై కొని పర్జన్యసుతుని
బాణజాలములను భరియింపలేక
యేణులగతిఁ బాఱిరేపెల్లఁబొలిసి,
నాఁటిరోషంబు మనంబుననుంచి
పాటించకివుడు నెపంబుసంధించి
సకల తేజంబులుఁ జదురొప్పునన్ను
నకలంకగతి నీదురాత్ముఁడై నట్టి
దుస్ససేనుండతిదోషవర్తనుఁడు
దుస్సంగి [1]చండాలదుర్మార్గుఁ డిట్టు
లవమానమొనరించె నాగ్రహంబునను.
ప్రవిమలయశులైన పాండునందనుల
చెలువనై గోవిందుచెల్లెలనంగ
వెలసియుండిననన్ను విరసంబునందు
నింతసేయుదురయ్య యీసభచూడ !
నెంతయు. " నని దుఃఖమీఁదుచుండఁగను

  1. చాండాలి. (మూ)