పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/668

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

602

ద్విపద భారతము.


వేదాంతవేద్యుని విమలాబ్ధిశయను
నాదినారాయణు నాద్యంతరహితు
సర్వభూతాత్మకు సర్వలోకేశు
సర్వగీర్వాణాబ్జసంభవ వినుతు
శరణాగతత్రాణు సకలకల్యాణు
మురదైత్యహరణుఁ బ్రమోదవిస్ఫురణు
ద్వారకాపురివాసుఁ [1]దరళితోల్లాసు
ధీరుని రవికోటి తేజష్ణుఁ గృష్ణుఁ
జిత్తాంబుజంబునఁ జింతించిపలికె:
“సత్తుగా నిన్ను నే శరణువేఁడితిని
ఘన మనో వాక్కాయకర్మంబులందు ;
ననిశంబునిన్నె కా కన్యమెఱుంగ ;
నీమహదాపద కిటనీ వెదిక్కు;
స్వామి, సర్వేశ్వర, సత్కృపాంభోధి,
కావంగఁ బ్రోవంగఁ గర్తవునీవు ;
ఈ వేళ నను బ్రియంబెసగ రక్షింపు ;
భద్రేభవరద, యోప్రహ్లాదవరద,
యద్రీంద్రధర, రావణానుజవరద,
మానుగా నాయభిమానంబు గావు
మానితంబుగ ననుమానంబులేక."
అని సన్నుతించిన, హరియు సత్కృపను
వనజాక్షి ద్రుపదభూవరతనూజకును
అక్షయవస్త్రంబు లఖిలంబు నెఱుఁగఁ
దత్ క్షణంబున నిచ్చెఁ దాత్పర్యమునను.
అట దుస్స సేనుండు నాగ్రహంబునను
దటుకునఁ గదిసి యాద్రౌపదిచేల

  1. దరళి. (మూ)