పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/665

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

599


దుశ్శాసనుఁడు, దురాత్ముఁడుసుయోధనుఁడు
దుశ్శాస [1]నస్థులై దుష్ట [2]వర్తనలఁ
బాండవేయులను ద్రౌపదిని నీభంగి
నొండొండయవమాన మొనరింపుచుండఁ
బెంపుతో మీర లుపేక్షింపఁదగునె !
సంపూర్ణచిత్తులు సభికు లుత్తములు
గాంగేయ ధృతరాష్ట్ర కలశజ కృపులు
నింగితజ్ఞులు లోకహితదయాపరులు
పలుకకయుండంగ [3]భావ్యమా మీకుఁ !
దలఁపఁ దక్కినసభాస్థలిలోనివారు
మహిత కామక్రోధ మదలోభములను
మహిలోనఁదక్కి నిర్మలచిత్తులగుచు
నధికధర్మము వల్కుఁ డఖిలంబునెఱుఁగ;
బుధనుతులార, సత్పుణ్యాత్ములార,
మీరూరకుండిన మెఱసి యేనొకటి
కోరి ధర్మంబుగైకొని యెఱింగింతు;
'పరికింప జూదంబుఁ పానంబు వేఁట
పరుషోక్తులును బహుభక్షణాసక్తి
........ .......... ........ ......... ..........
......... ........ ......... ......... ..........
ధారుణి ధర్మంబుదప్పి వర్తిల్లు
వారికృత్యంబులు వర్ణింపఁదగదు ;
మాయజూదంబున మఱియొడ్డినట్టి
యాయుధిష్ఠిరునకు ననిలజపార్థ
నకుల సహాదేవ నరవరేణ్యులకుఁ
బ్రకటిత సత్కులభామయైనట్టి

  1. నస్థులు.
  2. వర్తనులు.
  3. బాధ్య. (మూ)