పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/630

ఈ పుట ఆమోదించబడ్డది

564

ద్విపద భారతము.


గందినకైవడి శౌరవేశ్వరుఁడు
కుంది మనోవ్యధఁ గొసరి వివర్ణ
దేహుఁడైయుండె ధాత్రీరాజ్యభార
మోహంబుదక్కి యిమ్ముల సుహృజ్జనుల-
తోడ మాటాడక తుది రహస్యమున
నోడకయుండె యధోచితంబుగను.
వేదనఁబొరలుచు విముఖుఁడైయున్న
యాదుర్యోధను నప్పుడు చూచి
శకుని యిట్లనియె నాశ్చర్యంబుతోడ :

దుర్యోధను దురాలోచన

"వికలుఁడవై రోషవేషంబునొంది
యేల నాతోడ నీ [1]విన్నిన్నినాళ్ల-
వోలెను బలుకవు భూమీశతిలక !
ఇంతచింతింపంగ నేటికినీకు ?
నెంతటికార్య మిట్లెఱిఁగింపవలయు.
నేనుండఁగా నీకు నేటికిఁ దలఁక !
గానఁగఁబడు నెంతకార్యంబుదీర్తు:
వ్యాకులపడకుండు వసుధేశతిలక !
లోకంబులో నృపలోకసంసేవ్య !"
అనిన సుయోధనుం డాశకునితోడ
వినుపింపఁబూనె వివేకంబుతోడ:
"నీవునుజూచితి నేనుఁజూచితిని
భూవలయంబున బురణించిచూడ
నేయుగంబునఁగల్గ దీసభమహిమ
శ్రీయుతంబై భూప్రసిద్ధమైయుప్పె.

  1. వెన్ననినాళ్ల. (మూ)