పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/627

ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

561


“సకలరాజన్యవంశములలోనెల్లఁ
బ్రకటమై యొప్పె నీభరతవంశంబు ;
రంజిల్లఁ జేసితి రాజసూయంబు ;
మంజులవాక్య, నీమహనీయకృపను
ఇలఁ గృతార్థులమైతి; మేము భూములకు
నెలమిఁబోయెద." మన్న నెఱిఁగి ధర్మజుఁడు
ఆనతియొనరింప, నపుడు భీముండు
ననిచె భీష్ముని ధృతరాష్ట్రు; నర్జునుఁడు
ననిచెను యజ్ఞ సేనాదుల ; సుబలు
వెనువెంటనరిగి వావిరి భక్తిననిచె
నకులుండు ; కృపు ద్రోణు నయభక్తిఁ బంచె
నకలంకమూర్తి సహాదేవుఁడంతఁ;
బరగ విరాటుని భగదత్తుఁబనిచె
సరసచిత్తమున ధృష్టద్యుమ్నుఁడపుడు ;
సార్వ తేయుల మహీపతులను ననిపె
సర్వసొమ్ములునిచ్చి సౌభద్రుఁడెలమి ;
ధరణీసురులఁబంచెఁ దమగృహంబులకుఁ
గరుణవాటిల్లంగ గౌఁగిళ్లఁ జేర్చి ;
పాండునందనులను బద్మలోచనుఁడు
నిండు వేడుకల మన్నించి యిట్లనియె:
"సకలభూతములు పర్జన్యునిఁ బక్షి
నికరంబు [1]ఫలధారుణీజంబు నెపుడు
భజియించుకైవడి బంధువులెల్ల
భజియింపుదురు నిన్ను భక్తియుక్తముగ."
అనిన శ్రీకృష్ణున కనియె ధర్మజుఁడు :
“అనఘాత్మ, నీకృపయందు నామఖము

  1. లోధారుణీజంబునందు (మూ) చూ. నన్నయ, సభా. ద్వి. ఆ. 79 ప.