పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/619

ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

553


అవని నీయట్టి దురాత్ముండు గలఁడె!
వివరింపు మున్ను గోవిందునిచేఁత;
[1]పూతకిఁజంపి యాపూజ్యశకటము
రీతిభేధించి గిరిన్ గేలనెత్తి,
వృషభంబువధియించి విగ్రహంబునను
విషచిత్తుఁడైన గోవిందునిపేరు
పొగడ నీకొకజిహ్వ పొందుగా ; దదియుఁ
బగిలి వ్రక్కలునూఱు పరఁగునుగాక,
అతివల, గోసమూహంబు, బ్రాహ్మణుల,
నతులితాన్న ములిడినట్టివారలను,
విశ్వసించినవారి వేగఁద్రుంచినను
విశ్వధారుణియందు వే పాపమండ్రు ;
వనజనేత్రుండు గోవధయు స్త్రీవధయుఁ
జెనసిచేసెను భూప్రసిద్ధంబుగాను ;
అట్టిగోవిందున కర్ఘ్యంబు నీవు
గట్టిగా నిప్పించి ఘనతనుండితివి.
అదియునుగాక, పరాంగననాక
కదిసి యంబికయనుకన్యకామణిని
నీవుదెచ్చు టెఱింగి నీసహోదరుఁడు
శ్రీవిలాసుండు విచిత్రవీర్యుండు
ధర్మజ్ఞుఁడై దానిఁ దగవిడ్చిపుచ్చె.
దుర్మదాంధుండవు దురిత దేహుఁడవు
జననిందితుండవు సంతానహీనుఁ
డన నున్న నినునమ్మ నగునె లోకులకు !

  1. 'పూతకింజంపిన పూజ్యసంఘముల - రీతిభేదించి గిరికేలనెత్తి'. అని యీపాదములిట అనన్వితములుగా మూలమునఁగలవు. "పూతనాఘాతంబు చేత నేతరమైన...” అనుపద్యము పైరచనకాధారమైయుండును. చూ.నన్నయ, భా.సభా. 2 అ. 41. ప.