పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/618

ఈ పుట ఆమోదించబడ్డది

552

ద్విపద భారతము.


......... ......... ........ ......... ..........
డత్తఱి భీష్ముఁ డాయధిపతికనియె
"నారాయణుఁడు జగన్నాథుఁ డచ్యుతుండు
కారుణ్యమున నీమఖంబు గావఁగను
ఒరులు విఘ్నముసేయ వోపుదురయ్య !
హరిమీఁదగూడిన యుఖిలసేనలును
ఈశిశుపాలుండు నీక్షణంబునను
నాశంబులగుదురు నామాటనిజము.
కుక్కలు మదకుంభి కుంభస్థలములు
వ్రక్కలింపంగను వసుధలోఁ గలవె !
హరిపరాక్రముఁడైన హరిమహత్త్వంబు
ధరఁగొందఱెఱుఁగరు తత్త్వహీనమున."
అని భీష్ముఁడాడిన, నాగ్రహంబునను
మును శిశుపాలుండు మొనసి యిట్లనియె:

శిశుపాలుఁడు శ్రీకృష్ణు నధిక్షేపించుట

"నీముదివెఱ్ఱియు నీపాండవులును
దామోదరునిఁ బరతత్త్వమటంచు
భ్రామికంబులయందుఁ బల్కుచున్నారు;
భూమిలో నెవ్వరుఁ బూజింపరతని ;
నిన్ను ధర్మజుఁడు మన్నింపుచున్నాఁడు ;
చెన్నలరఁగ యుధిష్ఠిరుఁడును నీవు
నోడగట్టినదూల మొరపున మిగులఁ
గూడియున్నారు దిక్కులు సంచలింప.
కృష్ణునిఁజేపట్టి కిల్బిషంబునను
[1]నైష్ణికంబున నొందినాఁడవు నీవు.

  1. 'ఛాందస' మను వ్యావహారికపదానుసరణముగా నైష్ఠికత్వమను నర్థములో నీయపశబ్దమును బ్రయోగించియుండును.