పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/604

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

538

ద్విపద భారతము.


నాభీరగణముల నవలీలగెలిచి
యాభారతీసింధువందువర్తించు
[1]ద్రావణేయుల సముద్దండవిక్రములఁ
బావన గాంధార పర్వతాధిపుల
వశవర్తులనుజేసి, వాసుదేవునకుఁ
గుశలంబెఱింగించి కోరికతోడ
శాకల్యపురమున శల్యు [2]మద్రేశు
భీకరశౌర్యునిఁ బృథుబాహుబలునిఁ
దమమేనమామ నుత్తమగుణాంభోధి
రమణీయుఁడై కాంచి, రత్న రాసులను
హేమవాహనములు నీప్సితార్థములుఁ
బ్రేమతోఁగొంచును బిరుదుఁడై యరిగి
యక్షయ శ్రీపశ్చిమాంబుధిఁ జూచి
కుక్షి నివాసులఁ గ్రూరకర్ములను
బహుకిరాతులఁ బ్రతాపంబున గెలిచి,
విహిత సద్వరుణేంద్ర విశద సంవసధ
నరనాయకులచేత నానాధనములు
పరమానురాగుఁడై పడసి యవ్వాని
దశసహ [3]స్రోష్టకదంబంబు చెంత
వశముగాఁ బెఱికిరా వైరిభీకరుఁడు
నకులుండు వోయె ననంతశౌర్యమున.
అకలంకులైనట్టి యనిలజ పార్థ
నకులసహాదేవ నరవరోత్తములు
ప్రకటిత గుణధైర్య బాహువిక్రములు
విశ్వభూతలము దిగ్విజయంబుచేసి
శాశ్వతశ్రీ లెల్ల శమనసూననకు

  1. గ్రామణీయులని నన్నయ, సింధుకూలాశ్రితా యేచ గ్రామణీయా మహాబలా. అని వ్యా. భా.
  2. మాద్రేయు.
  3. ప్రాష్ట......చేత. (మూ)