పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/584

ఈ పుట ఆమోదించబడ్డది

518

ద్విపద భారతము.


అక్షులునాకు వాయుజధనంజయులు; (?)
పక్షీంద్రగమన, నా భావంబు నీవు;
మిముఁ బాసి నిముషంబు మేముండ లేము;
కమలాక్ష, నీదివ్యకారుణ్యమునను
భీమునకును జంభభేదిసూనునకు
నేమియుఁ దలపోయ నిప్పుడువలదు.”

కృష్ణుఁడు భీమార్జునులతో జరాసంధుఁ జంపింపఁబోవుట

అని వారినిచ్చి నెయ్యమున దీవించి
యనిపిన, వారలు నాత్మనుప్పొంగి
నదులయందును గృతస్నాసులై గిరులు
విదితాటవులు దాటి వివిధదేశములు
గనుఁగొంచు మగధేశుఘనభూమిఁ జొచ్చి,
యనుపమ గోరథంబను గిరియెక్కి,
యాలోకనముచేసి యాగిరివ్రజము
మేలైన రత్నపుమేడలదాని,
నమరావతీపురి కలకాపురికిని
సమమైనదానిని, సకలసంపదలఁ
జెలువొందుదాని వీక్షించి మిక్కిలిని,
జలజూక్షు డనిలజశక్రసూనులకు
నరుడంద భక్తితో నప్పుడిట్లనియె:
"పరికింప గో[1]రథపర్వతాగ్రంబు,
వైహారి, [2]ఋషిగిరి, వరచైత్యకాద్రి
యూహింప నివినాల్గు నొసరఁజుట్టులను
గాచియుండును ద్రిలోకములు నుతింప
నేచందములఁజూడ నిది గిరివ్రజము;

  1. వధ
  2. సిరిగిరివర జైత్ర (మూ)