పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/582

ఈ పుట ఆమోదించబడ్డది

516

ద్విపద భారతము.


శలభంబు వహ్నితో సద్విహంగములు
బలుగరుత్మంతుతోఁ బ్రతిఘటింపుటలు;
ఎల్లవారలు వీనియేచిన దాడి
హల్లకల్లోలమై హతులౌదు రిట్లు;
బల్లిదుండగు వీనిపటుశౌర్యవహ్ని
యెల్లరాజులపగ యెల్ల మాయించు;
నేడుదీవులవారి నిట్టట్టుచేయు
దాడియొనర్చి [1]యుద్దండితవృత్తి;
శతమఖుశౌర్యంబు శమనుధైర్యంబుఁ
బ్రతిఘటించెడి బాహుబలపరాక్రముఁడు;
నందివాహనుకృపనందినయట్టి
పొందైన మణిమయ పుష్పంకంబెక్కి
యాదిత్యసమతేజుఁ డౌనట్టి వీని
మేదినిలోపల మీ ఱంగరాదు;
దివ్యాస్త్రముల వీనిదివ్యదేహంబు
దివ్యులకైన ఛేదింపంగ రాదు;
[2]నదుల సముద్రుఁడున్నతిని జేకొనెడు
పొదుపున ఘనమహీభుజులసంపదలు
సర్వంబు నీజరాసంధుండు గొనును
సర్వభంగుల." నని చండకౌశికుఁడు
చెప్పి గ్రక్కునఁబోయెఁ జిత్రంబుగాను.
అప్పుడు తనయుని నాబృహద్రథుఁడు
భద్రాసనంబునఁ బట్టంబుగట్టి
భద్రేభగమనలఁ బరఁగఁదోడ్కొనుచు
దపమునేయఁగ వనస్థలమున కరిగె.
నుపమ జరాసంధుఁ డురుశత్రువిశతి

  1. యుద్దాడిత
  2. నదులు సముద్రుండున్నతను జేకొనును. (మూ)