పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/535

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

469


మ్రొక్కుము; నిన్నునాముదితదీవించు;
నక్కాంతదీవెన వ్యర్థంబుగాదు"
నావుడు నయ్యింతి నాథునియాజ్ఞ
[1] వేవేగ నా కాంత వీక్షించి మ్రొక్క,
ననయంబు నాసాధ్వి యాదరంబమర:
......................................
వెలఁది, నీపురుషుండు విజయుఁడౌఁగాక;
తలఁపంగ వీరమాతవు నీవుగమ్ము.
అనుచు దీవించుచో, నంత నర్జునుఁడు
చనుదెంచి యన్నకు సద్భక్తి మ్రొక్కి
భీమధౌమ్యులకును బ్రీతిమైనెఱిఁగి,
యా మాద్రిసుతుల నొయ్యనఁగౌఁగిలించి,
గరమొప్పఁ దనయాత్రకథలెల్లఁ జెప్పి,
హరిసత్వమున యాదవావలిఁ ద్రోచి
హరిణాక్షిఁదెచ్చినయదియును జెప్పి,
సరస[2]రీతులఁ బథశ్రాంతి దీఱంగ
సరస[3]సుభద్రుపచారముల్ సేయఁ,
బరమానురాగ సౌభాగ్యుడైయుండె.
వారిజాక్షుండు ననుజభర్తకును
దటుకున నరణంబు దానిచ్చు వేడ్క
సారణ బల సాంబ శైనేయ ముఖ్య
వీరులు సేవింప వేవేగఁగదలి,
కరి రథ హరిభటుల్ గదిసికొల్వంగ,
వర భేరికాహళావళులు ఘోషింప,
హరి యింద్రప్రస్థ మహాపురంబునకు
నరుదెంచి, యాపాండవాత్మజులకును

  1. వేవేగఁ జని కుంతి వీక్షించి మ్రొక్క
  2. ధీరుల
  3. సుభద్రోపచారముల్, (మూ )