పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/515

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

449


సుదతికిఁ బతికి నచ్చో నిరావంతు,
డుదయించె సుతుఁడు సద్యోగర్భమునను.
వాసవిమాఱుగా వానిశేషాదు
లాసతోనీక్షించి రందఱు వచ్చి.
అంత, నులూచిచే నంపించుకొనుచుఁ
గౌంతేయుఁడును దొంటికందున నిలిచె.
తనకథ బ్రాహ్మణోత్తములకుఁ జెప్పి,
ఘనరతి నిఖిలగంగల నాడుకొనుచు
వచ్చి యంతనగస్త్యవటము నీక్షించి,
యచ్చట భృగు[1]తుంగమను తీర్థ మాడి,
కోటికన్యాదాన గోకోటి దాన
హాటకదానంబు లచ్చోటఁ జేసి,
నృపచంద్రుఁడుత్పలినియుఁ గౌశికియును
అపరనందయ నందయనుసరోవరము
సేవించి, జాహ్నవీసింధుసంగమున
వావిరి మాసోపవాసంబు సలిపి,
రత్నగర్భంబు హిరణ్యగర్భంబు
యత్నంబుతోఁజూచి యచ్చోటుకదలి,
పురుషోత్తమమునకుఁబోయి, యచ్చోటఁ
బురుషోత్తముని లోకపూజ్యుఁ బూజించి,
వేలాతటంబున వెసఁబోవఁబోవఁ
గాళింగభూములు గానవచ్చినను,
అతిదూరమయ్యెడునని విప్రసమితి
మతికల్మి నూరికిమరల వీడ్కొలిపి,
కొందఱువిప్రులు గూడియేతేర
నందందచని మహేంద్రాచల మెక్కి,
 

  1. శృంగమను (మూ )