పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/514

ఈ పుట ఆమోదించబడ్డది

448

ద్విపద భారతము


“నన్నేల తెచ్చితి నాతి! నీవెవ్వ?
రిన్నలినాక్షుల నేలయంపెదవు?
తెలిసె నించుకమాకుఁ; దీర్థవాసులకు
వలరాజుకేళి తా వర్ణింపవలయు
ము; న్నటుగాక , పాములతోడిపొత్తు;
మిన్నకపోయెద మేదినీస్థలికి."
అనుటయు లజ్జించి యనువెల్లమఱచి ,
[1] తనలోనె తానగి, తడవాపఁజూచి :
"నాగకన్యక నేను; నాపే రులూచి;
బొగొప్పఁ గౌరవ్యఫణికిఁగూఁతురను;
పెండ్లిప్రాయముదాఁకఁ బెనిచి నన్నతఁడు
పెండ్లిసేయఁడు తగుప్రియుఁడు లేఁడనుచు;
గరుడోరగామర గంధర్వులందుఁ
బరికింప మిట్టిసౌభాగ్యంబువాని .
ఏను నీమూర్తికి నిచ్చలోఁజొక్కి
భూనాథ, తెచ్చితిఁ బుష్పాస్త్రునోమ.
ఇంద్రుఁ డింద్రునిపుత్రుఁ డింద్రునిపౌత్త్రు
డింద్రాభ, దివి భువి నిచటను వలదె!
ఇంద్రుఁడుగలఁడు; నీవింద్ర పుత్రుఁడవు;
ఇంద్రపౌత్రునినింకనిచ్చోటనిలుపు.
ప్రాణేశ, నాకంటెఁ బాత్రంబులేదు;
ప్రాణదానముసేయు బహుపుణ్యమిచ్చు.
అనయంబు గాంధర్వ[2] మనెడివివాహ
మున నన్నుఁగూడవే! పోదు నీవ్రతము."
అని దైన్యదశనాడ, నతఁడాదరించి
వనితయౌవనపుష్పవాననఁగొనిన,

  1. తనలోనెతాడాంగితడబాపజూచి
  2. మైన (మూ)