పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/508

ఈ పుట ఆమోదించబడ్డది

442

ద్విపద భారతము


నృపకుమారులఁగాంచి నెమ్మితో వారి
యుపచారములఁగాంచి యొప్పనిట్లనియె:

నారదుఁడు పాండవులకు హితోపదేశము సేయుట



"తమ్ములందఱు ధాత్రిఁ దఱచైన నేమి?
మిమ్ముఁబోలఁగరాదు మిత్రభావమున.
మూఁడుమూర్తులు నొక్కమూర్తియన్నట్లు
పోఁడిమి కేవురుఁ బొసఁగ నొక్కళ్ల.
నీటినడుమడఁచిన నెఱిరెండుగాని
[1] సూటి మీకూటమి చూడనచ్చెరువు;
అగుఁగాక యేమి, నెయ్యముచిక్కువాస
మగువల నిర్మించె మాయపుబ్రహ్మ
మగువ లెందఱు లేరు! మహిఁ గృష్ణవోలు
మగువగల్గదుగాక మానాఢ్యులార!
సుందోపసుందులు సుదతికిఁగాదె!
మ్రందిరి తమలోన మర్యాద లేక;
కావున, వత్సరక్రమమునఁగాని
యేవురుఁ బాంచాలినిటఁ గూడరాదు.
ఒక్కఁడు రతి [2]సేయుచున్న బాంచాలి
నొక్కఁడయ్యేఁటిలో నొగిఁజూచెనేని,
యతఁడు వత్సరమాత్ర మఖిలతీర్థముల
వ్రతధారుఁడై గ్రుంకి వచ్చువాఁ.” డనుచు
నందఱ నొడఁబడనాడి యాబ్రహ్మ
నందనుఁడేగిన, నాఁటినుండియును
మరియాదదప్పక మగువఁ బాండవులు
మరుకేళిఁగవయుచో, మఱియొక్కనాఁడు

  1. చూటమి
  2. సేయనున్న (మూ)