పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/49

ఈ పుట ఆమోదించబడ్డది

44

పాఠకులు మన్నింతురుగాక. ఈగ్రంథమునకు రెండవసారి యచ్చుపడుభాగ్యము పట్టునేని యీలోపములన్నియు నందు సవరింపఁబడును.

ఈసంపుటములోని బాలసరస్వతీశ్వరుని సభాపర్వమందలిరచన కేవలబాలకవిత్వమువలె నున్నది. గ్రంధసంపూర్ణతకు వెలితిలేకుండుటకై యీసభాపర్వము ప్రకటింపక తప్పినదికాదు. పైఁజూపినగుణవిశేషము లన్నియు తిమ్మయకవిత్వమునకు సంబంధించినవేకాని యీతనిరచనలోనివి గావు.

తంజావూరినుండి యీప్రతి వ్రాసి తెచ్చుటకై ఆంధ్రవిశ్వవిద్యాలయముచే నియుక్తులైనవారు శ్రీ. కొమ్మసమంచి జోగయ్యశర్మగారును, శ్రీ. టి. రామచంద్రాచారిగారును. ప్రతి వ్రాయుటలో వారు చూపినశ్రద్ధకు నే నెంతో సంతోషించితిని. ఊరక జీతముకొఱకే పనిచేయువా రట్టిశ్రద్థ చూపలేరు.

ఈయిర్వురిలో జోగయ్యశర్మగారు ఇంచుమించు నేఁటివఱకు నాకు చేఁదోడు వాఁదోడుగా నుండి, యీకార్యనిర్వహణములో నాతో సమానమగు నభినివేశమునే చూపిరి. ఈయనుచరునికతముననే దుస్సహమైన నాశ్రమ కొంతసహ్య మనిపించినది.

ఆంధ్రవిశ్వకళాపరిషత్తు,పింగళి లక్ష్మీకాంతం

6 - 2 - 1943.