పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/485

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

416


నైదక్షరంబుల నమరుమంత్రంబు
నైదుమొగంబుల నమరెనోయనఁగ
నైదుమాఱులు నాథునడిగినసతికి
నైదవతనమీయ నైదయ్యె ననఁగ
నైదువర్ణములైన యైదుమోములను
వేదనిశ్శ్వాసముల్ వెడలఁజేయుచును,
[1] గృతకకోపాక్రాంత గిరిరాజ్యకన్య
నతిసక్త నంకభాగాసీనఁజేసి,
యిక్షుచాపునిదేహ మింక లేకుండ
లక్షించినట్టి లలాటనేత్రంబు,
వలపునఁ దలకెక్కువడువుదీపింపఁ
జలిలేమవిడిసిన చదురుకెంజడలు,
మెఱయు వెన్నెలపువ్వు మేకొన్న వేయి
చెఱఁగులతలపాగఁ జెలువొప్పుమౌళి,
..................................
..................................
నునుబూది మైపూత నునుపుగాఁబూసి
యాలమిండనినెక్కి యతిసంభ్రమమున,
బసవని టెక్కె మభ్రంబున గ్రాలఁ,
బసగల్గు ధవళాతపత్త్రముల్ మెఱయ,
సతులు వింజామరల్ జానొప్పవీవ,
సుతులు బరాబరుల్ సొంపారఁజేయ,
వరహంస గజరాజ వాహ[2]నులగుచుఁ
బరమేష్ఠి యింద్రుండు భక్తి సేవింపఁ,
గరి మేష మహిష రాక్షస నక్ర హరిణ
తురగవాహనములు దొరయంగ నెక్కి

  1. కృతకాల కుపితాంఘ్రి గిరిరాజకన్య
       నతిసక్త వామాంక నభ్రాంతిచేసి,
  2. వాహన్య (మూ)