పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/471

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము


కృష్ణుఁడు పాండవులఁ జూడవచ్చుట


అనునంత, రామసహాయుఁడై శౌరి
కనకరథంబున గరుడాంకమమర
[1] మేదినిడిగ్గిన మేఘమోయనఁగ
నాదినారాయణుండచటి కేతేరఁ,
దమకుఁబ్రాణముగాన దైత్యారిరాక
కమర మేనులువొంగ నతిసంభ్రమముస
నాచారములు సేసి, యర్హపీఠముల
[2]నాచారుమూర్తుల నర్థిఁబూజించి,
సేమంబులడుగుచు శ్రీకృష్ణుఁజూచి
భీమాగ్రజుఁడుపల్కెఁ బ్రేమరెట్టింప :
"లక్కయింటికిఁదప్పి లక్ష్మీశ, యేము
తక్కకవెడలి యీధాత్రి నేరికిని
వివరింపఁగారాక విప్రవేషములు
నివిడివర్తించుచో నీవెట్లుగంటి?
భువనంబులన్నియుఁ బుక్కిటనిడిన
దివిజవంద్యుఁడవీవు తెలియనిదేది!”
అనినఁ గృష్ణుఁడుపల్కు : "నమరులకైనఁ
గనుఁగొనఁ బనిగొనఁగారానివిల్లు
నృపతులందఱుఁజూడ నీసహోదరుఁడు
చపలాక్షికై వంచె సత్వంబుకలిమి
ఇట్టిచేఁతల మిమ్ము నెఱుఁగుట యరుదె!
పట్టిచూడఁగరాక ప్రబలులోకముల.
దుర్యోధనుఁడుసేయుదుష్కార్యములకు
ధైర్యసమ్మతులార, తగులక మీరు

  1. మేదికి
  2. ఆచార (మూ)