పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/468

ఈ పుట ఆమోదించబడ్డది

402

ద్విపద భారతము


అనఘులార ! యనిత్య మధ్రువప్రాణ
మనుమాన [1]మీచందమన మున్ను వినరె!”
అనియార్చి కవయుచో, హరివారికనియె:
"జననాథ, యీవృథాసాహసం బేల!
కరమెన్నఁ దమకు శక్యముగాని పనికి
జొరక నెమ్మదినున్కి సుమతికి మనికి.
విలువంచినప్పుడే వీరలబలిమి
తెలియవు నీ కేమి తిక్కపట్టినదొ!
ఇరువురుగూడినా రిలకెల్లఁగలరు;
వరుస నెవ్వరు తోడువత్తురో వెనుక!
దొఱఁకొన్న విరిపాటి దునియదు రణము;
మరలుటకార్యంబు మాకుఁ జూచినను."
అనిచెప్ప హరిమాట లతఁడు పాటించి
తనవీరసైన్యంబు తప్పకత్రిప్పి,
పనిగానిసిగ్గునఁ బట్టణంబునకుఁ
జనుచు [2]మేలందినజాడగా నడచి
కరిపురికరిగినఁ, గలరాజులెల్ల
మరలిరి తమతమ మనికిపట్టులకు.
తనియ దక్షిణలిచ్చి తమగ్రామములకు
ననిచెఁ బాంచాలుండు నంత బ్రాహ్మణుల.
ఇట భీమపార్థులు నింతిఁ దోడ్కొనుచుఁ
బటువేషములతోడ వచ్చిరి మరలి.
కుంభినీపతులిట్లు కోమలిఁగొనుచుఁ
గుంభకారులవాడ గొమరొప్పఁ జొచ్చి,
తమవిడిసిన [3]యింటిద్వారదేశమునఁ

  1. మాచంద్ర
  2. యేలిందిన
  3. యట్టి (మూ)