పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/467

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

401


గాలివానఁజరించు కారాకువోలెఁ
జాలఁదూలి చలించి శక్రజుఁ బలికె :
"నన్నిట్లుమార్కొని నడుఁకక నిలిచి
కొన్నిబాణములేయఁ గుంభినిమీద
హరిసూనుఁడోపు శ్రీహరియోపుఁగాక
బిరుదుల మూఁడవపేరు నేనెఱుఁగ.
నీవెవ్వఁడవు నాకు నెఱిఁగింపు తొలుత;
చేవేఁడి మఱికాని నేయ నీమీఁద;
నిజవిద్య మఱికాని నెఱప నీ మీఁద;
ద్విజమాత్రుఁడవొ! కాక [1]ధృష్టతె?"ట్లనిన
ననిమిషేంద్రుని పుత్రుఁ : “డాప్రసంగంబు
వెనుకచెప్పెదఁగాక; వినుము నిన్నిపుడు
తల దునుమకమానఁ దప్పించుకొనుము:
పలుకులతో నిఁకఁ బనిలేదు కర్ణ!”
అని వేగ మీఁద దివ్యాస్త్రంబులేయ,
ననిఁ గాలువొందక యతఁడువణంకి
'విప్రుని నిన్నేయ వెఱతునే' ననుచు
క్షిప్రవైఖరిఁ బాఱె సేనలు చెదర.
ఆకర్ణశల్యులిట్లైన విస్మయము
గైకొని యిట్లనుఁ గౌరవేశ్వరుఁడు :
“ఆలంబులోఁ గర్ణునలయించి తఱుమఁ
జాలునెయొకఁడు! వాసవిచాలుఁగాక;
లోపంబులేక శల్యునిఁద్రెళ్లవైవ
నోపునేయొకఁడు! వాయుజుఁడోపుగాక;
ఉఱికెదవీరిపై నొగి విప్రులనక
నఱికెద; నావెంటనడువుఁడీ దొరలు.

  1. ధృష్ట మెట్లనిన (మూ)