పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/466

ఈ పుట ఆమోదించబడ్డది

400

ద్విపద భారతము


పోలికలిట్టివీభువినెన్ని లేవు!
వాలంపవాన సర్వముఁగానవచ్చు;
[1]నంటిన భావమెన్నఁడునిరువురకు
వింటలే; దిదియెందు [2] విన్నది లేదు;
కుడువఁబోవుచునేలకూరాకులడుగఁ
దొడిర;" మ్మనుచునుండఁదొడరి రిర్వురును.
బలశిలీముఖ[3]శాతభల్లనారాచ
విలసార్ధచంద్రాది విశిఖంబులేసి,
యొండొరుచాపంబు లొండొరుపడగ
లొండొరుకవచంబు లోలి ఖండించి,
ధనువులు నాలోన ధరియించునంత,
నినతనూజుఁడు ఫాలమేడింట గ్రుచ్చి
కోదండగుణ మొక్కకోలఁ ద్రుంచుటయు,
మోదించి చిఱునవ్వు మొలవ నర్జునుఁడు
నారిగైకొని నాల్గునారాచములను
వారిజాప్తతనూజువక్షంబు నాటి,
మూఁడువాలమ్ముల ముఖవీథిగ్రువ్వ,
వాఁడర్జునునిగ్రుచ్చి వాఁడితూపులను
పటుతరనారాచపంక్తులీరీతిఁ
దటుకుననేయుచో, దగనర్జునుండు
సరికక్షనిలువక శాతనారాచ
నిరవధి [4]వృష్టి నించిన,మూర్ఛఁబొంది
భానుతనూజుండు వడివడిఁ దెలిసి
యూనిననెత్తుట నుదయార్కురీతిఁ
బగులుమేనికిఁగాక పడగకుఁగాక
తెగుసారథికిఁగాక తేరికిఁగాక

  1. అట్లైన
  2. విందును
  3. కర్త
  4. ముష్టి (మూ)