పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/455

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

389


చాపంబుగదియుచో, శక్రజుఁజూచి
యాపార్శ్వచరులెల్ల నటతమలోన:
"నద్దిరా! సతిమీదనాస బ్రాహ్మణున ;
కిద్దీర్ఘమైనవిల్లెట్లు ! తానెట్లు !
పార్థివేంద్రుల సిగ్గుపఱచినదాని
నర్థిడగ్గఱియె మేలనవచ్చు వీని! "
ననిరికొందఱు; కొందఱ : "ట్లేల ! వీడు
ధనువునకెంతయుఁ దగియున్న నాఁడు ;
ధరణిపై నెవ్వరెంతటివారుగలరొ !
పరికింపుచుందము భావికార్యములు;
నృపుల నుల్లస [1]మాడనెగడిన బాణ-
తపముపెంపెట్లైన దనకునున్నదియొ!”
అనుచోట, మఱికొంద : "ఱట్లేల ! వీడు
మనమంత్రసిద్ధుండు గాఁబోలు మొదల;
అట్టివారలకు సాధ్యముగానిదెద్ది !
యెట్టిదొ కాక యీయింతిభాగ్యంబు!"
అని. రంత, బ్రాహ్మణులతనిదీవించి :
“ఘనుఁడ, మాకపకీర్తి కట్టకుమయ్య !
[2]యిందని లావున నీవిల్లువంచి
కందువగన్నట్లు ఘనయంత్రమేసి,
కల్యాణ దేవతగరుణ గైకొనుము
కల్యాణగీతి వాక్యములు మిన్నంద. "
ననుచుండ నాపార్థుఁడావిల్లు గదిసి,
పొనరఁ బ్రదక్షిణంబుగవచ్చి నిలిచి,
జడధులు దశదిశాచక్రంబు భీతి
నడుక భుజాస్ఫాలనంబొనరించి,

  1. మాడినుడిగిన.
  2. యిందఱి (మూ)