పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/451

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

385


బ్రమథులతోడఁ బాల్పడి పోరినట్టి
సమరభీమునిఁజూడు జలజాక్షి, బలుని.
కర్ణుఁజూడుము వీఁడా కర్ణాంతనేత్ర!
దుర్ణివారుఁడు వీడె! దురములోపలను;
ఎన్నికఁ [1] గవులకు నితఁడిచ్చుధనము
పన్నగపతియైన భరియింపలేడు.
కౌరవపతి వీఁడె కమలాక్షి, చూడు
ధారుణీశుల నెల్లఁ దగనేలినతఁడు ;
వీనిధాటీభేరి వినినవీరులకుఁ
గానరావలెనొండెఁ గానఁబోవలెను.
నలువొప్ప ధృతరాష్ట్రునకు బిడ్డనిచ్చి
బలిమి భూస్థలిఁ జెల్లుబడిగాఁగ నేలు
బంధుసంపదఁ గాకిబలగంబుఁ దెగడు
గాంధార రాజు నోకల్యాణి, చూడు.
ఈతఁడు శూరసే; నితఁడువిరాటుఁ;
డితఁడు - [2]భగదత్తుఁ; డితఁడు సైంధవుఁడు ;
ఇతఁడు చిత్రాంగదుం; డితఁడు సుషేణుఁ ;
డితఁడు సేనాభిదుం ; డితఁడు సుశర్మ
వాఁడె సుమిత్రుండు ; వత్సరాజితఁడు ;
వాఁడె చూడుము పౌండ్రవాసుదేవుండు ;
శ్రీనిధులదె చంద్రసేన సముద్ర-
నేన శుభాంగద చేకితానులును."
అనిచూపి వెండియు నవనిఁ గాంభోజ-
ఘనశూరసేన కేకయులాదిగాఁగ
నృపులఁ గన్గొనఁజేసి, నెమ్మి బ్రాహ్మణుల
సపరిమితాధ్వరాహర్తలఁ జూపి,

  1. కౌలకు
  2. భగవంతుడు. (మూ )