పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/448

ఈ పుట ఆమోదించబడ్డది

382

ద్విపద భారతము


వట [1] ఫలాధరకు దువ్వట మావటముగఁ
దటుకునఁ గట్టి, యెంతయు ముదంబొదవ
మట్టెలు మొలనూళ్లు మణివలయములుఁ
గట్టి, నేవళములుఁ గంఠమాలికలు
బవిరె లుంగరములుఁబల్లేరుపువ్వు
లివియాదిగా సొమ్ము లింతికిఁ దొడిగి,
వాలికలైన నివ్వాళికలెత్తి,
బాలికామణికి సౌభాగ్యదర్పణము
చూపినఁ, దనరూపు చూడలజ్జించి
ద్రౌపది తనయింటి ధనువుచింతించి:
యీకార్ముకమువంచి యెవ్వఁడే నన్ను
[2] గైకొనునట్లౌనొ! కాదొకొ !" యనుచుఁ
[3]దలపోయఁ, జెలువలాధవళాయతాక్షిఁ
గొలువుకూటమునకుఁ గొమరొప్పఁదెచ్చి
యారాజునకుఁజూప, నతఁడుముద్దాడి
కీరభాషిణిఁ బల్లకీ యెక్కఁ బనిచి
ఛత్రచామరములు [4]సకియలు పూనఁ
జిత్రవైఖరి మహానేనలు నడవ,
సంతనకట్టి ధృష్టద్యుమ్ను కవుడు
నెంతయుఁ బ్రియమున నిట్లనిపలికె:
“కన్నియ రాజమార్గంబునఁ జనుచుఁ
గన్నిచ్చయగురాజుఁ గైకొనరాదు;
వెలయ బ్రహ్మక్షత్ర విట్ఛూద్రులందు
నలువొప్ప నెవ్వడైనను గొదలేదు ;
ఇవ్విల్లుమోపెట్టి యిషుపంచకమున
దవ్వులయంత్రమత్స్యమునెవ్వఁడేయు

  1. బలాధరకి
  2. కైకొనునట్లనాకాకనాకనుచు.
  3. తలపొల
  4. చలువలు(మూ)