పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/447

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

381



బోరుక లంగ నంభోనిధిద్రచ్చు
నారావమునుబోలె నప్పుడెంతయును.
అటమున్న ద్రుపదరాజాత్మసంభవసు
బటుతరకల్యాణ [1] భాగ్య యోగ్యతలఁ
గైనేయఁబనిచినఁ, గలికి జవ్వనులు
చేసూటి బోఁటిమెచ్చినపరిపాటిఁ
జంపక తైలంబు చారుధమ్మిల్ల
సంపదకింపుగా సకియకు సంటి,
కలకంఠి నలసత గదియకయుండ
[2] నలకలు మెల్లన నతివకుదువ్వి,
కుంకుమ చందన గోరోచనముల
పంకంబు [3]సతిమేనఁ బసిమిరానలంది,
నీలాలకాఁగుల నెఱి దొరలించి
యోలిఁబట్టినతీర్థ మువిదకు నార్చి,
మెత్తని [4] వలిపాన మెయితడి యొత్తి
యుత్తమాంగజలంబు లొయ్యన విద్రిచి,
తొడరి కాలాగరుధూపవాసనలఁ
దడియార్చి, మల్లికాదామముల్ దురిమి,
తిలకంబు బాలికాతిలకంబునుదుట
నలికంబుగాఁ బెట్టి నగవంకురింపఁ,
గాటుక తెలిసోగకన్నుల వ్రాసి,
పాటించి మకరికాపత్రంబు లొత్తి,
స్వాతి తా ముత్తెమై చనుదెంచె ననఁగ
బ్రాఁతిగా నాసికాభరణంబు పెట్టి,
మృగనాభికప్రము మేలన చేసి,
మృగనేత్ర చక్కని మెయిదీఁగె నలఁది

  1. భాస్య
  2. నలకంట
  3. గతి
  4. వలిపెము. (మూ)