పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/444

ఈ పుట ఆమోదించబడ్డది

378

ద్విపద భారతము


నుదయింతునన్నట్టు లుదయాద్రి సూర్యు
డుదయించె నర్ఘ్యంబు లొసగ బ్రాహ్మణులు.

ద్రౌపదీ స్వయంవరోత్సవము



అటమున్న ద్రుపదుండు నఖిలదిక్కులకుఁ
బటులీలఁ గల్యాణపత్రికల్ వ్రాసి
క్షత్రకోటికిఁ జెప్పఁ, జయ్యన వారు
యాత్రామహాభేరు లందంద మ్రోయఁ
దమతమగొడుగులుఁ దమతమపడగ
లమిత వైఖరి [1] మెఱయ నా ప్రొద్దె కదలి
వచ్చుచో, శల్యుండు వజ్రతుల్యుండు
నచ్చినభుజబలోన్నతిఁ బెచ్చు పెరిగి:
'విలువంతు గుఱిద్రుంతు వెలఁదివరింతుఁ
బలుకులేల !' ని వచ్చె బాంచాలుపురికి ;
శిశుపాలుఁ డతిరథశ్రేష్ఠులతోడ
దశదిశఅద్రువఁ బ్రతాపించి కదలి
తగినకోమలిగల్గె దనశయ్యకనుచు
నగియెడువారిఁ -[2] గానక వచ్చె నటకు;
దుర్యోధనుఁడు మహాద్భుత వైభవమున
ధైర్యభూషణులైన తమ్ములు గొలువ
నేకార్ణవఖ్యాతి నిభములు గొలువ
ఢాకతోవచ్చెఁ జుట్టవువానిపురికి ;
నలివేణిఁబొందాస నంగాధిరాజు
నలుగడఁ గవికీర్తనంబులు, చెలఁగ:
విజయుఁడుర్వరలేనివేళ [3] నేఁదెత్తు :-
గజయాన' ననివచ్చెఁ గాంపిల్యపురికి ;

  1. మ్రోయ.
  2. గానఁగవచ్చెనతఁడు
  3. యేతెంతు. (మూ)