పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/442

ఈ పుట ఆమోదించబడ్డది

376

ద్విపద భారతము


గవచధారులువోలెఁ గదలి పాండవులు
జవమొప్ప నడచుచు సంప్రీతి [1]యడరఁ
బోవుచో, గొందఱు భూసురోత్తములు
త్రోవ గుంపులుగూడి తోడ్తోన నడవఁ,
గ్రోధమించుక లేక కుంభినిఁబరఁగు
సాధువిప్రులఁగూడి జననియుఁ దారు
నడచి శరావతినది యుత్తరించి
యడరంగవచ్చుచో, నంతఁ గట్టెదురఁ
గాంచిరి మణిసౌమ్య కాంచనరమ్య
సంచిత సురపురీ సమభాసురంబు,
గజరాజ భటరాజ ఘనరాజయోగ
నిజకీర్తిగుణసుధా నిర్మలీకృతము,
నభ్రస్థలభ్రమ[2]దభ్రసందర్భ
విభ్రమాస్పద సౌధవీథిబంధురము,
గేలీగృహాంచిత కృత్రిమపుష్ప
లీలావిలోల శిలీముఖాకులము,
నిరుపమ తారుణ్య నిచితలావణ్య
వరవనితారత్న వైభవోజ్జ్వలము,
బహుతర కుట్టిమ భర్మమాణిక్య
మహనీయ తోరణమార్గ శోభితము,
రవిరథవాహ విక్రమ[3]ధావనోత్థ
పవనచాలిత కేతుపట భావితంబు
నింపార ద్రుపదరాజేలుచునున్న
కాంపిల్యనగరంబుఁ; గనుఁగొని యలరి
విప్రకోటులుఁ దారు వేడ్కఁ గౌంతేయు
లాప్రొద్దెసొచ్చి సూర్యాస్తమయమునఁ

  1. నడుమ
  2. దర్భ
  3. దానహేతు (మూ )