పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/425

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

359


అనినఁ, గవ్వడి పల్కు: “ నావశిష్ఠునకు
మును గౌశికుం డేల మొగినెగ్గుచేసె?
విను, బ్రహ్మ[1]మౌని యావిమలుఁడెట్లయ్యె?
వినవేడ్కయయ్యెడు వినిపింపునాకు."
అనవుడు గంధర్వుఁ డర్జునుకనియె:
“ననఘ, చెప్పెద నదియంతయువినుము;
తొల్లి రాజన్యుఁడై దొరయుకౌశికుఁడు
సల్లీల జగమెల్ల శాసింపుచుండి,
సకలసేనలుగొల్వ శైలాటవులకు
నొకనాడు వేఁటమై నొప్పుగాఁబోయి,
నొగిలించి మృగముల నూల్కొన్నశాంతి
మగిడి వశిష్ఠాశ్రమమునకువచ్చె.
వచ్చిన గాధేయు వరుస నమ్మౌని
యచ్చుగాఁ బూజించి యర్థినిట్లనియె :
"మహితాత్మ, మాయాశ్రమంబున నేఁడు
విహితసేనలు నీవు విందారగించి,
దీవసఁబొంది యీదివసాంతమునను
బోవంగవలె," నన్నఁబొంగి కౌశికుఁడు :
“నమలాత్మ, నీమాటకడ్డంబుచెప్ప;
నమర నన్నియు వేగ నావటిం,” పనినఁ
గైకొనివచ్చి యాఘనతపోధనుఁడు
ధీకాంతఁ దమకామధేనువుఁబిలిచి,
విందు తెఱ౦గెల్ల వినిపించి, వేడ్కఁ
బొంది 'భోజన మెల్లఁబుట్టించు' మనిన,
నాకామధేనువు నట్లకాకనుచుఁ
బ్రాకటంబుగ నన్నపర్వతంబులును,

  1. మౌనత్వ (మూ)