పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/406

ఈ పుట ఆమోదించబడ్డది

340

ద్విపద భారతము


మధువైరి [1]నియత సమర్చితాచరణ,
విధిశిరోమాలికా విభ్రమాభరణ,
నిత్యాత్మ, పరమాత్మ, నిఖిలభూతాత్మ,
సత్యాత్మ, ద్రోణునిఁజంపెడికొడుకు,
నరునకుదేవిగా నాకొక్కకూతుఁ
గరుణింపు." మనుటయుఁ, గాలకంధరుఁడు:
"హోమంబు సేయుము, హోమకుండమున
భూమీశ, యిరువురుఁబుట్టుదు.” రనుచుఁ
బంచాస్యుఁడేఁగినఁ, బాంచాలుఁడరిగి
పంచ[2]భక్ష్యములతో బ్రాహ్మణతతికి
నెడపనిభోజనంబులు పెట్టుటకును (?)
గడగట్టి, శాలలు కట్టించి, యంత
యాజోపయాజుల నఖిలసన్మునుల
యాజత్వమునకు నర్చించి తెచ్చి,
యాగోపకరణంబులన్నియుఁ గూర్చి,
 [3]యాగాగ్నులను దాను నాత్మలో నిలిపి,
దేవేంద్రసుతునకు దేవిగాఁ గూఁతు
వావిరి గురునకువైరిగాఁ గొడుకు
బుద్ధిలోపలఁగోరి పుత్రకామేష్టి
యద్ధాత్రిపతి వ్రేల్వ, నగ్నికుండమున
మణికిరీటముతోడ మార్తాండకిరణ
గుణ[4]ధనుర్లతతోడ గురుశక్తితోడఁ
దూణీరయుగముతోఁ దొడవులతోడ
శోణాశ్వములతోడ సుతుఁడొక్కరుండు,
మందహాసముతోడ మంజిమతోడ
నిందీవరశ్యామ హితకాంతితోడ

  1. నేత్ర
  2. భక్షణలతో
  3. యాగమగ్నులుదాను
  4. ధనుల్లతి (మూ)