పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/387

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

321


ఉరవడి మ్రింగెద నోలి మిమ్మెల్ల
నఱిగిపోదురుగాక యరిది నాకుక్షి”
ననుచు దండాకారమగు బాహుదండ
మనిలజుమీఁద నయ్యసుర యెత్తుటయు,
నదలించి [1]తనదుబాహాశక్తి వానిఁ
బ్రిదులకుండఁగఁబట్టి భీమసేనుండు :
ఆజియిచ్చటనైన నాసంభ్రమమున
రాజులనిద్రాభిరతి యేమియగునో!
యెడగలుగఁగ వీనినీడ్చెద;” ననుచు
నొడలెల్లదోఁగ దైత్యుని భీముఁడీడ్చె .
విడిచినఁ గాల్కొని వీఁగకయ్యసుర
పిడికిటఁబొడిచిన, భీముండువొడిచె.
 [2]పసరించుపోటుల వసవిచారింప
నసురమర్త్యుఁడు మర్త్యుఁడసురయు నైరి.
అప్పుడు రణకాంక్ష నతఁడును నితఁడు
నుప్పొంగి పేర్చి బాహువులప్పళించి,
యురమును నురము, బాహువులు బాహువులు,
శిరమును శిరము నూర్జితశక్తిఁదాఁకి
పిడికిటిపోటులఁ బెడచేతివాట్ల
విడువనివ్రేటుల విసరు [3]దాటులను
నుక్కులై పోరుచో, నురుపాదహతుల
నిక్కినధూళి మునింగిరిర్వురును.
తుదినుండి మొదలికిఁ దొలుసంౙమొగులు
పొదివిన భూధరంబులజోడు వోలె
మఱయుచో, భీమునిమెదలరాకుండ
నిజకటంబునఁబట్టి యింద్రారియార్వఁ
గలఁగెఁబయోధులు, కంపించె గిరులు,
తలగ్రుచ్చెఁగూర్మంబు, తడఁబడెదిశలు.

  1. వాని
  2. పసిమిన
  3. వాటులును (మూ)