పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/377

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

311


ధర్మసూనునకది దర్శింపజేజేయ,
ధర్మజుండదిచొచ్చి తమ్ములుఁ దాను
నిచ్చలఁ బరమాత్ము హృదయంబులోన
జొచ్చినసుఖ మిందుఁజొచ్చినఁ గలిగె,
కదలిన నిది పుష్పకముఁబోలకున్నె!
కదలక యిదివోలుఁ గనకాద్రిగుహను.
ఈశ్వరునకు నిట్టియిల్లబ్బెనేని,
శాశ్వతంబుగ నేల! శయనించు నొలికి;
నారాయణున కిట్టినగరబ్బెనేని,
నీరధిలో నేల నిద్రింపఁదలఁచు!
కమలజుం డీయిల్లు గానండుగాక,
కమలంబులో నేల ఘనధూళిఁబ్రుంగు!
ఇంతచిత్రపుమేడ లింద్రుండు చూడ,
నంతరిక్షంబున నతఁడేలయుండు!"
అనికొనియాడి, గృహంబున్నయునికి
మనమలరింవక , మఱియొక్కనాఁడు
భీమునకదిచూపి పృథివీశుఁడనియె:
ఏమొకొచిత్ర! మీయిల్లున్నయునికి
నామదినమ్మదు నానావిధముల;
నీమించుపుట్టెనే! యితరమృత్తికల!
తైలాజ్యములతావితఱచు కుడ్యములఁ
జోలింపుచున్నవి; పొడవెల్ల లక్క;
కపటంబునకుఁగాని కలుగదీసొబగు;
విపరీతమునఁగాని వెలయదీయొప్పు;
ఆగ్నేయదిశనుండునదికారణముగ
నగ్నిభయంబున కర్హమీయిల్లు.
చక్కచూడ్కికి బురోచనుఁడు రోచనుఁడు
మక్కువ [1]వీనినమ్మఁగనెట్లువచ్చు!

  1. వినియునమ్మంగ (మూ )