పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/375

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

306


సంతోషమున నాత్మసఖుల వీడ్కొలిపి,
యెంతయు వేడుక యిగురొత్త నపుడు
గురు భీష్మ కృపులకు గురుభక్తి మ్రొక్కి,
పరఁగినబ్రాహ్మణప్రతతికి నెఱఁగి,
యారూఢచాపులై యరదంబు లెక్కి,
పౌరుల బహుదీనభాషలు వినుచు,
'నడరి యాపురలక్ష్మియయిదుప్రాణములు
వెడలెఁబొ' మ్మనితోప వెసనూరువెడలి,
యీసున గురుపతి యిలఁబొగడించు
వాసన వారణావతముమేలనియుఁ
దగఁ దండ్రియాజ్ఞగదా యిది! యనియుఁ
బొగులక తెగువమైఁ బోవుచున్నెడను,
గొంతదవ్వుల వీడుకొనువేళ విదురుఁ
డంతకసుతుఁజేరి యల్లసఁబలికె :
"పనిలేనిపని మిమ్ముఁ బతి తొలంగించె;
ననుమానములకెల్ల నాలయం బిదియు;
నచ్చటి శస్త్రవిషాగ్నిబాధలకు
హెచ్చరికలుగల్లి యీరుండవలయు;
బలవంతులని మిమ్ముఁ బరిమార్చుబుద్ధి
మెలఁగుఁగౌరవుఁ; డదిమీరుఁగన్నదియె;
యేనును వారి [1]సంచెఱిఁగి, మీకడకు
బూని యొక్కొకదూతఁబుత్తెంతు" ననుచు
జెప్పి కుంతికి మ్రొక్కి, చింతాభరంబు
గప్పినమనసుతోఁ గ్రమ్మఱవచ్చె.
పదియాఱు పదియేను బదునాల్గు మఱియుఁ
బదుమూఁడునగునేండ్ల ప్రాయంబునాఁడు

  1. చెంచెఱిఁగి (మూ)