పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/371

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

305


పాముచందంబునఁ బగపట్టకున్న,
భూమీశునకు భీతిఁబొందరు నృపులు;
అరిరాజు శిశువని యాలస్యమొప్ప;
[1]దరులు చేరువనున్న నటపాపవలయు;
నమ్మించియైనఁ బుణ్యము వైరిఁజంప;
నిమ్మాడ్కి నృపనీతి యెఱుఁగు కుమార!”
[2]అని పురస్త్రీలకు నాబుద్ధుఁడెట్లు (?)
మునునీతిచెప్పె నామునువునఁ జెప్పె,
విని సుయోధనుఁ డంత విభు నేకతంబ
కనుఁగొని దైన్యంబుగానరాఁ బలికె :

దుర్యోధనుఁడు తండ్రితో తనమనోదుఃఖము నెఱిఁగించుట



"పాండుసూనులకేనుభయమందుటెల్ల
మండలేశ్వర, నీవు మదినెఱింగియును,
రమణీయమగు యువరాజపట్టంబు
యమసూతికొసగితి వక్కట! తగునె!
జ్ఞాననేత్రుఁడవని జగతీశ! నిన్ను,
సూనులులేరని సురనదీసుతునిఁ
దలపోసి, ధర్మనందనుని రాజ్యమున
నిలిపెదరనివింటి నిక్కమీమాట.
వసుధాప్రజకు మంచివాఁడు గాఁగోరి
పసిఁడివెచ్చము సేయుఁ బార్ధుండు మిగుల.
పెద్దవాఁడవునీవు పృథివినీసొమ్ము ;
తద్దయు నాకురాఁదగదె! మీఁదటను.
నిజము చెప్పెద, వారు నృపతులై యుండఁ
బ్రజలకు నామీఁదఁ బట్టదుచూడ్కి


  1. వరులు
  2. "అని పురందరుకు బృహస్పతి యెట్లు," అని వ్రాసెనేమో