పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/364

ఈ పుట ఆమోదించబడ్డది

298

ద్విపద భారతము


పులిఁగోలవైచినపోల్కిఁ బాంచాలుఁ
డలిగి కార్ముకభీమమగురథం బెక్కి,
భట ఘోట రథ దంతిపంక్తితో వెడలి
పటుభంగిఁ గౌరవబలముపైఁ బడిన,
నీక్షింప భయమయ్యె నిరువాగురణము
నక్షీణసుభటశస్త్రాస్త్రదీధితుల,
తుండంబు లొండొండుతో బిట్టుపెనఁచి
శుండాలములపోరు చోద్యమైయుండె;
[1] జగతీశులర్థమై జగడింప, గిరులు
తెగి తాఁకినట్లయ్యెఁ దేరులుతాఁకి;
నానాభిధాన బాణంబులు వేయ
వేనామముల విష్ణువిధమైరిభటులు
అనుపమ శంఖ కాహళ పటహాది
నినదముల్ రథకింకిణీగుణధ్వనులు,
రౌద్రహుంకార పరస్పరాహ్వాన
భద్రేభగర్జితబాణనాదములు
సతతమైనిగుడఁ, బాంచాలుఁడావేళ
ధృతరాష్ట్రసుతులపైఁ దేరుదోలించి
గుఱుతింప నరుదైనకోలలుపఱపి,
[2]తఱుచుగా నరులకుఁ దాఁ గానరాక
యదలించి, [3]యందఱనన్నిదిక్కులకు
నొదిగింపఁ, గురువీరులుగ్రులై కదిసి,
పాంచాలుసేనల బాణవర్షముల
ముంచి, మొగ్గరములు మొగిఁజిక్కువఱచి,
తొడిఁబడఁ గాల్వురఁద్రుంచి తూటాడి,
బెడఁగుగాఁ దేరులుపెఱికిపేటాడి,

  1. జగతిశమార్థమై
  2. తరచునరిలకు
  3. యన్నిటి (మూ )