పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/363

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

297



కౌరవులు ద్రుపదునెదిర్చి పరాభూతులగుట

.


"గురుదక్షిణార్థమై గూర్చితి మిమ్ము :
నురుకీర్తులార, మాకొసగరె యొకటి!”
అనిన , దుర్యోధనుం : "డనఘ, మీకెద్ది
మనసునకిష్టంబు మమువేఁడు." డనిన,
దొల్లియేఁజెప్పితి; ద్రుపదు గర్వాంధుఁ
బ్రల్లదంబులు నన్ను బలికినవానిఁ
బ్రాణంబుతోడనే పట్టి తెం."డనిన
ద్రోణాజ్ఞ గురుకుమారులు నూటయొకరు
కర్ణుండుతోడుగాఁ గరిరథతురగ
దుర్ణివారబలంబుతో నూరు వెడలి
మున్నాడినడువ, నిమ్ములఁ బాండుసుతులు
విన్నాణముగ ద్రోణువెనుక నేవురును
నరదంబు లెక్కి సైన్యములతోనడవ,
నరుడందు నాచార్యునకుఁ గేలు మొగిచి :
“అనఘ, వీరేఁగెదరక్కట! తమకు
గొనకొని చిక్కునొకొ ! ద్రుపదుండు;
మీపూర్వసఖుఁడని మీఁదుచింతింప;
రేపాటిబిరుదులో! [1] యెఱుఁగరు తమ్ముఁ;
దడవరు ధర్మనందనుఁ బెద్దవాని!
నొడువరు భీమసేనునితోడు తోన;
ఆ రాజపుర మేమియగ్రహారంబె !
వీరలుదిరుగక విలువంప నేను."
అనునంత రథధూళి యాకాశపథము
మునుముట్టఁ, బురము నిమ్ములఁజుట్టుముట్టి,
కురుకుమారులు కంఠ[2]కుహరనాదములు
పరఁగింప, నందఱఁబాటికిఁగొనక,

  1. యెరుంగము
  2. కురహ (మూ )