పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/347

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

281


యంతరిక్షంబున యంత్ర [1]కాకంబు
సంతతచలముగాఁ జక్కఁబన్నించి,
కోదండహస్తులఁ గురుకుమారకుల
నాదటరప్పించి యా పక్షిఁజూపి,
తొలుత నజాతశత్రునకిట్లువలికె:
"బలియుఁడ, కంటివే పక్షి[2]శిరంబు?
ననుజులఁగంటివే యాచూపులోన?
ననుఁగానవచ్చునా? నయనాంతవీథి. "
ననిన నాతడు: “కంటి నదెపక్షి శిరము
నినుఁగాననయ్యెడు; నృపులుఁదోచెదరు;
వీయుదునా పక్ష్మి నిలఁగూల" ననిన,
నాయనకోపించి యప్పుడిట్లనియె:
"నీవేయనేరవు; నీదృష్టి చెదరి;
నావిధంబులువేఱె; యవినీకు రావు. "
అని ధర్మసుతునని, యయగారితనము
తనరంగనిలిపి గాంధారేయుఁజూచి:
“యీవేమిపొడగాంచితెఱిఁగింపు; మనిన
నావీరుఁడును బల్కె యమసూతియట్ల,
భీమునడిగిన నట్లభీముండుచెప్పె;
నామాడ్కి, నందఱనడిగి ద్రోణుండు
కడవట నర్జునుఁ గార్ముకకుశలు
నడిగిన, నతఁడు లక్ష్యముచక్కఁజూచి :
“పూని పక్షి శిరంబుపొడగంటిఁ ; గాని,
యేను నీచెప్పినవేమియుఁ గాన ;
నేసెదఁ జూడుఁడీ యీ పక్షి." ననుచు
భాసురజవమొప్ప బాణంబువిడిచి,

  1. శారంబు
  2. పేక్ష (మూ )