పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/344

ఈ పుట ఆమోదించబడ్డది

278

ద్విపద భారతము


నేకలవ్యుఁడు దానియెలుఁగాలకించి,
దాఁకొని యోజనత్రయదూరుఁడయ్యు
నాదట నాధనునభ్యసింపుచును
మోదించి, చిఱునవ్వు మొలవంగ నపుడు
వాఁడిశరంబుల వాఁడేనుదొడిగి
పోఁడిమి [1] నేసెను బొచ్చెంబులేక
యనువార సారమేయము నోరుగాఁడఁ
దొనకోలలొకటిగ దూపిడ్డకరణి.
వేవచ్చి శునక మవ్వేషంబుతోడ
భూవరాత్మజులకుఁ బొడసూపుటయును,
దమవిద్య కుఱుచగాఁ దలపోసి, వారు
గుమిగూడి చొప్పుగైకొని పోయిపోయి,
హిమగిరిపొంత నయ్యేకలవ్యాఖ్యు
గమనీయభుజచాపు గరిడిలో నొంటి
నీక్షించి, వెఱఁగంది : "యెవ్వాఁడవీవు ?
శిక్షయెవ్వరిచేత [2]సిద్ధించె నీకుఁ?
దలఁపనచ్చెరు!" వన్నఁ, దలఁకక వాఁడు:
“కలశసంభవుచేతఁ గంటినీవిద్య ;
నేకలవ్యుండనేనెఱుకల ఱేఁడ ;
నేకలవ్యయమును నెఱుఁగఁ గయ్యముల ;
గోపినఁ జనుదెండు యుద్ధంబు సేయఁ
జాపహస్తులు మీరు సన్నద్ధు."లనిన
విన్ననై యందఱు వీగి, వెన్కకును
గ్రన్నన వచ్చిరి కరిపురంబునకు.
అంతట నొక్కనాఁడాబోయచరిత
మంతయు గురునకు నటయెఱింగించి,

  1. చేసిన
  2. శిక్షించె (మూ )