పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/339

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

273


పాంచాలపతి మాకుఁ బగవాడుగాని,
మంచిమేలొనరించె మాయెడాటమున.
అతఁడాదరించిన నరుదేరుమీరు;
సుతులకు శరవిద్య చోద్యమై లేదు.
కినిసి చెప్పఁగలేఁడు కృపుడుమోమోడి;
ధనువునఁ దీర్పవే దయతోడ సుతులఁ;
బ్రీతితో మీరుకోరిన కోర్కు లెల్ల
నాతతంబుగ నిత్తు ననిశంబు మీకు.”
అని చెప్పి ద్రోణున కాపగేయుండు
కనకరత్నంబులు, గంధవైభవము,
నెన్నికకెక్కిన యేడు గ్రామములు,
సున్నపుమేడలసొంపొరునిండ్లు,
నరుదార నవరత్నహార కేయూర
వరభూషణాంబరావళు లాదిగాగ
బాఁడికుఱ్ఱులనిచ్చి, పసిఁడితేరిచ్చి,
[1]నాడెంబుగలరత్నహారంబులిచ్చి,
తరుణీమణులనిచ్చి, ధనువభ్యసింప
గురుమతినిచ్చెనుగురుకుమారకుల.
అతఁడంతఁ గృపునిచే ననుమతివడసి
సితపక్ష[2]సితవారసితకరర్క్షముల
నందఱఁగూర్చి, విద్యారంభవేళఁ
బొందుగా భూపాలఁబుత్త్రులఁబలికె  :
ఇందఱుఁగడుశూరు, లిందఱుధీరు,
లిందఱు విలువిద్యయెఁఱిగినపిదప
నేనొకపనివుత్తు; నెవ్వఁడేనిందు
నూనినమతిఁ జేయనోపునె నాకు!

  1. నాడెల్లచెయు రత్నహారంబు లిచ్చి
  2. శితవాతశితశరక్షముల (మూ)