పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/331

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

265


కృపునిసోదరి నంతఁ గృపియనుదానిఁ
[1]దపనీయ కమనీయ తను నొయ్యనడిగి
పెండ్లియాడితి; వీఁడె బిడ్డండునాకుఁ;
బెండ్లిప్రాయంబయ్యెఁ; బేదకాపురము;
 [2]సర్వాంగములఁజూవె జనియించెఁ గొడుకు;
సర్వశాస్త్రంబులఁ జతురుఁడెంతయును.
ఇరువుర రక్షింప నేనోడి యంతఁ,
బరశురామునిఁ బోయి పసిఁడివేడినను,
అత: "డేను [3]ధనమును , నవనిచక్రంబు
హితమతి విప్రులకిచ్చితిమున్న;
యస్త్రంబులిత్తునో యర్థంబు మాఱు!
శాస్త్రజ్ఞ, యడుగుము చాలినవన్ని,
ఇరువదియొక్క మాఱేచి రాజులను
బొరిగొంటి నవియేమి పొల్లులుగావు".
అనిన, శిష్యుండనై యారాముచేత
జననాథ, గాంచితి శస్త్రాస్త్రవిద్య.
అదిగాక విను, మొక్కయయగారియొద్దఁ
జదురు నశ్వత్థామఁ జదువంగఁబెట్టఁ,
దనతోడి బాలురుఁ దానును గూడి
పనిగొన నక్షరాభ్యాసకాలమున
గురువుచే నంపించుకొని యిండ్లకేఁగి,
స్థిరమతితో వారు క్షీరాశనంబు
భుజియింపఁగాఁ జూచి బుద్ధిలోవగచి,
భజన నశ్వత్థామ పఱతెంచి, తనకు
వారారగించుకైవడిఁ బెట్టుమనుచు
ధారుణి మముఁ బెద్దతడవు ప్రార్థింప,

  1. కమనీయ తపనీయధను నొయ్య నడిగి
  2. సర్వాంశయును
  3. ధనువును (మూ )