పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/327

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

261


ద్రోణాచార్యవృత్తాంతము



వినవయ్య, మునిగోత్రవిఖ్యాతుఁ డనఁగఁ
దనరుభరద్వాజుతనయుండ నేను;
నాపేరు ద్రోణుండు; నరలోకవినుత!
యేపార విలువిద్య యెఱుఁగుదుఁ గొంత.
వరతనూజాతుఁ డశ్వత్థామ యనఁగఁ
బరఁగు నీతనిపేరు పార్థివ, వినుము.
శీతలజాహ్నవీసింధుసంగమున
మాతండ్రి యొకనాఁడు మజ్జనం బాడి
యచ్చోట వీక్షింప, హావభావములఁ
బచ్చవిల్తునిదీమొ! పసిఁడిపుత్తడియొ !
మొనసిన మెఱుఁగుల మొత్తమొ! కాక,
తనరారు లావణ్యధామమో! కాక,
దాఁచినవేడ్క ఘృతాచినా నొక్క
ఖేచరి తనజలక్రీడకు వచ్చి,
మునిఁగి లేచిన దివ్యమునిఁ గీరవర్ణు
ఘనుని భరద్వాజుఁ గానమిఁ జేసి
వలువూడ్చి ధరఁబెట్టి వారిలో నుఱకఁ,
.................................................
గదళికాకాండయుగ్మముఁ బోలు తొడలుఁ,
బదములకెంపులు భవ్యదీధితులు,
దెగగలకన్నులు దృష్టించి యలరి,
తగుతర్పణంబులతరవాయి మఱచి,
నియమింపనరిదైన నిజవీర్యధార
భయమున భూమిపైఁ బడనీక యపుడు
తొడఁగి తాఁ దెచ్చినద్రోణంబులోన

నిడఁగఁ, బుట్టితినందు నే ద్రోణుఁడనఁగ.