పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/326

ఈ పుట ఆమోదించబడ్డది

260

ద్విపద భారతము


వెండియు నీరీతి విశిఖంబు లేసి
కాండరజ్జువు చేసి, కలశసంభవుఁడు
ఈఁతనీళ్లమునింగి యేర్పడకున్న
నూతిలోపలిచెండు నుతగతిఁ దిగిచి
యిచ్చిన, వెఱగంది యిందువంశేంద్రు
లచ్చాపధరవర్యు నర్థితో మెచ్చి,
హర్షాద్భుతాక్రాంతులై కుమారకులు
శరగురుఁ దోడ్కొని సరవి నాచెండు
వడి గ్రుచ్చి పదిలమై వదలింపరాని
కడుకాండరజ్జువుఁ గైకొని వచ్చి
ధృతరాష్ట్రు కొలువులో దేవవ్రతాది
హితులముందఱఁ బెట్టి యెంతయుఁ జెప్ప,
సంతోషచిత్తుఁడై శాంతనవుండు
సంతుష్టుఁ గావించి శరగురు నపుడు :
"వెదకునౌషధలత వెసఁ గాలఁ బెనఁగె;
ముదమారఁ గడుదవ్వు [1]ములుగుచు నేగి
యాడఁబోయినతీర్థ మచ్చోటి కపుడు
వేడుక నెదురైనవిధ మయ్యె". ననుచు
వెనుకొని ద్రోణుని వేడ్కఁ బూజించి :
"యనఘాత్మ, మీ రెవ్వ రానతి యీవె!
ఆఖండపరశువో! యాఖండలుఁడవొ!
యేఖండమునఁ గాన మింతటివాని;
నెచ్చోట నుండుదు? రేది మీనామ?
మిచ్చోటి కేతేర నేమి కారణము?
విన వేడ్కయయ్యె మీవృత్తాంత.” మనినఁ
దనకునిచ్చినగద్దెఁ దగనుండి యతఁడు :

  1. మునుగుచు (మూ)